Read more!

జాగింగ్ చేసేద్దాం ఇలా...

జాగింగ్ చేసేద్దాం ఇలా...

మహిళలు తమ శారీరక ఆరోగ్య స్పృహ పెరిగినప్పుడు చాలామంది ఎంచుకునే వ్యాయామం ఏదైనా ఉందంటే అది వాకింగ్. అన్ని వయసుల వారు దీన్ని తమ లైఫ్ స్టయిల్ లో భాగం చేసుకోవచ్చు. అయితే ఈ నడిస్కను కాస్త వేగంగా చేస్తే దాన్నే జాగింగ్ అని అంటారు. నడక కంటే కాస్త ఎక్కువ ఫలితాలను ఇచ్చే ఈ జాగింగ్ పెద్ద వయసు వారు తప్ప టీనేజ్ నుండి మధ్యవయసు వారి వరకు ఎవరయిన చేయొచ్చు. అయితే ఇలాంటి ఆరోగ్య  సమస్య కాళ్ళ నొప్పులు వంటివి లేకపోతే 50 ఏళ్ళు దాటినా వారు కూడా జాగింగ్ చేయవచ్చు. వాకింగ్ కు ఎలాంటి ప్రత్యేక జాగ్రత్తలు లేకపోయినా అది అలా సాగిపోతుంది. కానీ జాగింగ్ చేయడానికి కొన్ని చిట్కాలు పాటించాలి. దీనివల్ల జాగింగ్ చేసినప్పుడు ఎలాంటి ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జాగింగ్ చేయడానికి  కంఫర్ట్ కూడా అవసరం అవుతుంది. కాబట్టి వాటి గురించి కొన్ని ఉపయోగపడే ముఖ్యమైన విషయాలు ఇవిగో...

చాలామందికి జాగింగ్ చేసేటప్పుడు ఎలాంటి దుస్తులు వేసుకోవాలి అనేది అవగాహన ఉండదు. కొందరు మహిళలు చీరల్లో ప్రయత్నం చేస్తుంటారు. అయితే జాగింగ్ చేసేటప్పుడు చుడిదార్  గాని, లూజ్ ప్యాంట్ లేదా జాగింగ్ డ్రస్ ను ధరించాలి, దీనివల్ల కాళ్ళు తొందర తొందరగా కదపడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. 

ఇకపోతే జాసింగ్ చేసే సమయం కూడా అన్ధస్రూ దృష్టిలో పెట్టుకోవాలి. ఏవో ఒక పనులున్నాయని, కుదరడం లేదని ఏ సమయం కంటే ఆ సమయంలో జాగింగ్ చేస్తుండటం కరెక్ట్ కాదు. మనం సమయానికి భోజనం చేయడం వల్ల ఎలాగైతే జీర్ణవ్యవస్థ ఆరోగ్యవంతంగా ఉంటుందో… సమయానికి కరెక్ట్ గా జాగింగ్ చేయడం వల్ల కూడా దానికి తగిన పలితాన్ని పొందగలుగుతాము. అయితే జాగింగ్ కోసం ఎంచుకునే వేళలు ఉదయం లేదా సాయంత్రం అయితే బాగుంటుంది. 

జాగింగ్ చేసేవారు ఎక్కువ మంది పాటించనిది ఏదైనా ఉందంటే అది కాళ్ళకు వేసుకునే షూ. చాలాశాతం మంది చెప్పులు వేసుకుంటారు.... అయితే జాగింగ్ కోసం తయారు చేయబడ్డ షూస్ వేసుకోవాలి. షూస్ లోకి  కాటన్ సాక్స్ వేసుకుంటే.... పాదాలకు ఇంకా మంచిది.

జాగింగ్ చేయడం ఆరోగ్యానికి ఫిట్ నెస్ కు మంచిదనే అభిప్రాయంతో మొదలుపెట్టినప్పుడు చాలా ఎక్కువగా చేయకూడదు. జాగింగ్ ను ఇంత దూరం, ఇన్ని నిమిషాల సమయం అనే ప్లానింగ్ తో మొదలు పెట్టాలి. ఆ టీసురువత మెల్లగా దాన్ని పెంచుకుంటూ పోవాలి. ఇలా చేయడం వల్ల దూరం పెరిగినా శరీరానికి అలసట తెలియకుండా ఉంటుంది. 

టీనేజ్ అమ్మాయిలు, యువతులు వాకింగ్ కంటే జాకింగ్ కె ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారుమ్ వారి వయసుకు తగినట్టు జాగింగ్ ను ఎంజాయ్ చేయగలుగుతారు కూడా. అయితే సరైన బ్రా, టీ షర్ట్, షూస్ ఎంపిక చేసుకుని జాగింగ్ చేయడం ఎంతో ముఖ్యం.  

 జాగింగ్ సాద్స్రణంగా ఉదయం చేస్తుందం మంచిది. అది కూడా ఉదయాన్నే లేవగానే కాస్త  ఫ్రెష్ అయ్యి వాకింగ్, జాగింగ్, యోగ వంటివి చెయ్యాలి. అంతేకానీ ఉదేశ్యం ఆలస్యంగా లేచి టిఫిన్లు గట్రా తిని ఆ తరువాత నింపాదిగా జాగింగ్ చేయకూడదు. అలాగే సాయంత్రం కూడా కాఫీలు, టీలు, స్నాక్స్ అంటూ అన్ని తిని జాగింగ్ చేయకూడదు. 

 మధ్య వయసు వారిలో కొంతమందిలో కనిపించే బిపి ఉన్నా, హార్ట్ సంబంధించిన అనారోగ్యాలు ఉన్నా డాక్టర్ ను సంప్రదించిన తరువాత వారి సూచనల ప్రకారము మాత్రమే జాగింగ్ చేయాలి.

ఇలా కొన్ని జాగింగ్ టిప్స్ పాటిస్తే ఆరోగ్యంగా ఆరోగ్యమైన అలవాటును హాయిగా కొనసాగించవచ్చు.

                                 ◆నిశ్శబ్ద.