Read more!

ఇవి తింటే ఎప్పటికీ యవ్వనంగా కనిపిస్తారు!

ఇవి తింటే ఎప్పటికీ యవ్వనంగా కనిపిస్తారు!
 


వయసు పెరిగే కొద్దీ మన స్కాల్ప్, హెయిర్, స్కిన్ అన్నీ తమ మెరుపును కోల్పోతాయి. మన చర్మం మెరిసిపోవడానికి మనం తీసుకునే ఆహారమే ప్రధాన కారణం. అంతే కాకుండా మనం తిన్న తర్వాత మన శరీరంలో జరిగే ప్రక్రియలు కూడా కారణం. మంచి ఆహారం తీసుకోవడం ద్వారా మన చర్మ సౌందర్యాన్ని లోపలి నుండి కాపాడుకోవచ్చు. వయస్సు పెరుగుతున్నా... యవ్వనంగా కనిపించాలంటే వీటిని తినడం అలవాటు చేసుకోండి.

బొప్పాయి పండు:

బొప్పాయి పండులో యాంటీ ఏజింగ్ గుణాలతోపాటు..యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ప్రధానంగా లైకోపీన్ బొప్పాయి పండు ఎరుపు రంగులో ఉంటుంది. వృద్ధాప్య ప్రక్రియను నివారించడంలో ఉపయోగకరంగా ఉంటుంది. బొప్పాయిని ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యంతోపాటు చర్మం కూడా మెరుస్తుంటుంది.

దానిమ్మ పండు:

దానిమ్మలో చర్మాన్ని రక్షించే గుణాలు ఉన్నాయి. దానిమ్మ గింజలు కొల్లాజెన్ ఉత్పత్తిలో పనిచేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా డైట్లో చేర్చుకున్నట్లయితే  చర్మ ఆరోగ్యం క్షీణించదు. అంతేకాదు  చర్మ సమస్యలు కూడా ఉండవు.

పెరుగు:

పెరుగు ఒక ప్రోబయోటిక్ ఆహారం. ఇది మన జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. మనం తినే ఏ ఆహారం మన శరీరంలో బాగా జీర్ణమైతే అది మన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
పెరుగు తినడం వల్ల మన చర్మానికి అవసరమైన విటమిన్ బి12 ఎలిమెంట్స్ కూడా అందుతాయి. ఇది మన చర్మం యొక్క గ్లోను పెంచుతుంది. అంతేకాదు కణాల అభివృద్ధికి చాలా సహాయపడుతుంది.

ఆకు కూరలు:

ఆకుకూరల్లో కొల్లాజెన్ పుష్కలంగా ఉంటుంది. దీనిలో యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నాయి.  క్లోరోఫిల్ పుష్కలంగా ఉండటం వల్ల మన చర్మానికి కొత్త మెరుపు వస్తుంది.

టమోటా:

టొమాటోలో లైకోపీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన చర్మానికి రంగును ఇస్తుంది. టమోటా పండు ఎరుపు రంగులో ఉండటానికి కారణం ఇదే. ఇందులో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉండడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మన చర్మం  తాజాగా మెరుస్తూ ఉంటుంది.

నిత్యం వీటిని ఆహారంలో చేర్చుకున్నట్లయితే మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.