Read more!

కలమూ.. గళమూ.. మన కోకిల సొంతం...

కలమూ.. గళమూ.. మన కోకిల సొంతం..

సరోజిని నాయుడు అనగానే ఓ గొప్ప రచయిత్రి, ఓ గొప్ప నాయకురాలు గుర్తొస్తుంది అందరికీ. సరోజిని నాయుడు జీవితంలో కొన్ని ముఖ్య ఘట్టాలు గుర్తుచేసుకుంటే ఒళ్ళు పులకరించిపోతుంది, తెలియకుండానే మనలో ఒక కొత్త శక్తి పొగవుతుంది.

"నేను ఆంధ్రమహిళను. నాది ఆంధ్రదేశం. ఆంధ్రమహిళలను మహాత్మా గాంధీ రాట్నంరాణీగా పేర్కొన్నారు. ఆది వారి ప్రత్యేక వారసత్వమైన అచంచల స్వభావం, మర్యాద లక్షణాలకు తగ్గట్టుగా ఉంది. ఈ మహిళా మణులకు తగిన లక్షణాలు వారి భర్తలకు అబ్బాయి. ఆంధ్ర రాజ్యాన్ని పరిపాలించిన చివరి రాజుల సాంప్రదాయాన్ని నాయకులు, వాలంటీర్లు కూడ కాపాడినందుకు శ్రీకృష్ణదేవరాయల ఆదరణ, సత్కారాలను మిగిలిన భారతదేశానికి ఎరుక పరచినందుకు నేను ఈనాడు గర్విస్తున్నాను. ఆంధ్రులు హృదయ పరిపాకమున శ్రేష్ఠులు" అని 1928 లో కాకినాడ కాంగ్రెసు సందర్భాన శ్రీమతి సరోజినీ నాయుడు అన్నారు.

ఆమె 18–2–1878 న హైదరాబాదులో జన్మించారు. ఆ ఊర్లో వున్న లిటిల్ గర్ల్స్ స్కూలులో చదువుకున్నారు. ఆస్కూలే ఇప్పుడు ఉస్మానియా స్త్రీల కళాశాలగా అభివృద్ధి చెందింది. పదమూడవ యేటనే మెట్రిక్యులేషను వున్నత శ్రేణిలో నెగ్గారు. 11వ ఏటనుంచే ఆమె ఇంగ్లీషులో కవితలు అల్లటం చూసిన నిజాముప్రభువు సంవత్సరానికి నాలుగువేల రూపాయల విద్యార్థి వేతనం ఇచ్చి వున్నత విద్యలకు ఆమెను ఇంగ్లండు పంపించారు. లండన్ కింగ్స్ కాలేజిలోను, కేంబ్రిడ్జిలోని గిర్టన్ కాలేజిలోను చదివారు. భారత దేశ వాతావరణ ప్రధానంగా అనేక పుత్తమ కవితలే ముఖ్యంగా వ్రాశారు.

ఒకసారి ఈమె ఆల్బర్టు హాల్లో జలియన్ వాలాబాగ్ దురంతాలను, స్త్రీలకు జరిగిన అవమానాలను గురించి చెపుతువున్నప్పుడు కొంతమంది రౌడీలు కావాలని అల్లరిచేయడం మొదలుపెట్టారు. ఆమె భద్రకాళిలాగ నోరుమూయండి అని పెట్టిన కేక ప్రతివాళ్లను ఆశ్చర్యపరచింది.

1928 సెప్టెంబరులో ఆమె అమెరికా వెళ్లారు. ఒకరోజు ఒక చర్చిలో ఉపన్యాసం ఇస్తున్నారు. ఇసుక వేస్తేరాలనంత జనం ఆమె మాట్లాడుతున్న తీరు చూసి ఆశ్చర్యంతో వింటున్నారు. ఆమె అందరి ముందు ప్రస్తావించిన  నమస్యలకు వారిలో ఎవరు జవాబులు ఇవ్వలేక పోయారు. అప్పుడొక గొప్ప వ్యాపారవేత్త "ఇటువంటి శక్తి నేను ఏ స్త్రీలోను చూడలేదు. నిజం చెప్పాలంటే ఎంత గొప్ప పురుషులు అయినా ఆమెకు నరితూగలేరు” ఆని సరోజీ నాయుడు ప్రతిభను మెచ్చుకున్నాడు.  స్వేచ్ఛా భావాలపట్ల, దేశ స్వాతంత్ర్యం పైన గౌరవంగల అమెరికన్లు నరోజినీదేవి ఆంతర్యంలోగల న్యాయతత్పరతను, స్వాతంత్య్ర గౌరవాన్ని వెలికి తీసుకువచ్చారని మెచ్చుకున్నారు. 

గాంధీజీ ప్రతి ఉద్యమాన్ని త్రికరణశుద్ధిగానమ్మి ఆమె వాటిలో పాల్గొనేవారు. ఉప్పు సత్యాగ్రహ సమయంలో దండియాత్ర చేసినవారిలో ఆమె ముఖ్యులు. గాంధీజీని అరెస్టు చేసిన తరువాత ఆమె ఉప్పు కొఠార్లపై జరిగిన దాడికి నాయకత్వం వహించారు. పోలీసులు ఆమెకు అన్నం, నీళ్లు అందకుండ చుట్టు ముట్టి వుండేవారు. ఆమె నవ్వుతు ప్రళయం వచ్చేవరకు నేను ఇక్కడ ఇట్లాగే వుంటాను, మరి మీరు వుండగలరా అని ప్రశ్నించారు. ఏ జవాబు ఇవ్వలేక పోలీసులు చివరకామెను 1980 మే 18న అరెస్టుచేశారు. 1982 ఏప్రిల్ 28న శాసనోల్లంఘనం సందర్భంలో ఆమెను బొంబాయిలో అరెస్టు చేసి ఒక సంవత్సరం జైలులో వుంచారు. తిరిగి క్విట్టిండియా ఉద్యమ సందర్భంలో గాంధీజీ, మీరాబేన్, మహదేవ గార్లతో పాటు అరెస్టుచేసి పూనాలోని ఆగాఖాన్ మందిరంలో బంధించారు. అలాంటి ప్రభుత్వమే.. 1981లో జైలునుండి విడుదల చేసి రౌండు టేబులు కాన్ఫరెన్సుకు భారత మహిళా ప్రతినిధిగా ఆమెను ఇంగ్లండు పంపించింది.

ఆమె అధ్యక్షత వహించిన సభలు, సమావేశాలకు లెక్కలేదు. 1920లో అంతర్జాతీయ మహిళా సభకు భారత ప్రతినిధిగా జెనీవా వెళ్లారు. తన వైదుష్యంతో, బెదురు లేని స్వభావంతో, అందరితో చక్కగా కలిసిపోతూనే ముక్కుసూటిదనంగా మాట్లాడుతూ  భారతస్త్రీలు ఇంతటివారు అనే మంచి అభిప్రాయాన్ని  మిగతా దేశస్తుల మనసులో కలిగించారు. 1947 మార్చి 28 నుంచి ఏప్రిల్ 2 వరకు ఢిల్లీ ఎర్రకోటలో జరిగిన ఆసియా ఖండ సమైక్య సభ ఆమె ఆధ్యక్షతన బ్రహ్మాండంగా జరిగింది. ఆమె అఖిల భారత మహిళాసభలకు అధ్యక్షత వహించారు. రౌండు టేబుల సభలకు హాజరయినారు. ఎక్కడికి వెళ్లినా ఆమె శాంతిదూతలానే అందరి మనసుల్లో గోచరించారు. 

ఇంతటి మహిళ నుండి మనం ఎంతో కొంత నేర్చుకోవాలి. సగటు మహిళలుగా మనమూ శక్తివంతంగా అవ్వాలి.

                                ◆నిశ్శబ్ద.