English | Telugu

దీప చనిపోతుందా..? మ‌రి 'కార్తీక దీపం' క‌థ ఎలా న‌డుస్తుంది?

'కార్తీకదీపం' సీరియల్ లో దీప (ప్రేమి విశ్వనాధ్) పాత్ర ముగిసిపోయిందా..? ఇక సీరియల్ లో వంటలక్క కనిపించదా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. దానికి కారణం నేటి ఎపిసోడే. ఈరోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో దీప ఎలాంటి తప్పు చేయలేదని.. కవలలిద్దరూ తన కన్నబిడ్డలేననే విషయం కార్తిక్ కు తెలిసిపోవడం, దీప చావుబతుకుల మధ్య సౌందర్య చేతుల్లో ప్రాణాలు వదిలేయడం వంటి సన్నివేశాలను చూపించారు.

పైగా ఎప్పటికప్పుడు లొకేషన్ అప్డేట్స్ ఇస్తూ తన అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా అభిమానులకు చేరువలో ఉండే ప్రేమి విశ్వనాధ్ కూడా పదిరోజుల క్రితమే కేరళ వెళ్లిపోవడం. ఇప్పటివరకు సీరియల్ కు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోవడంతో.. దీప నిజంగానే సీరియల్ లో చనిపోతుందా..? అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇన్నాళ్లు కార్తిక్ నిజం తెలుసుకోకపోవడమనే పాయింట్ తో సీరియల్ నడిపిస్తోన్న దర్శకుడు ఈరోజు ఆ ట్విస్ట్ ను రివీల్ చేశాడు.

దీంతో నిజంగానే దీప పాత్ర ముగిసిపోతుందేమో అనిపిస్తుంది. ఇదిలా ఉండగా.. టాప్ రేటింగ్స్ దూసుకుపోతున్న నంబర్ వన్ సీరియల్ 'కార్తీకదీపం'. ఇలాంటి సీరియల్ కు అప్పుడే ముగింపు వేస్తారనుకుంటే పొరపాటే. ఇప్పటికే వెయ్యి ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్న ఈ సీరియల్ మరో మూడేళ్లపాటు కంటిన్యూ అవుతుందని దర్శకుడు చెప్పాడు. కానీ సీరియల్ లో దీప పాత్రకు ఫుల్ స్టాప్ పెట్టి కథను నడిపించడమంటే సాహసమే. చూడాలి మరి ఏం జరుగుతుందో!

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.