Read more!

English | Telugu

గ్రాండ్ గా అమ్మ 60వ బర్త్ డే సెలబ్రేషన్స్!

స్మాల్ స్క్రీన్ యాక్టర్ శ్రీవాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో  సీరియల్స్ లో తనదైన నటనతో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. సోషల్ మీడియాలో శ్రీవాణికి భారీగానే  ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటిస్తూనే  వెండితెరపై కూడా అలా మెరిసి మాయమయింది. సీరియల్స్ తో  బిజీగా ఉంటూనే ఒక  యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. అందులో తన గురించి, తన ఫామిలీ, తన కూతురికి  సంబంధించిన విషయాలను ఫాన్స్ తో షేర్ చేసుకుంటుంది.  షూటింగ్ అప్ డేట్స్, సెలబ్రేషన్ వీడియోస్ కూడా షేర్ చేస్తూ ఫాలోవర్లను అలరిస్తుంటుంది.

తాజాగా శ్రీవాణి తన అత్తగారు జ్యోతిరెడ్డి  పుట్టినరోజు సెలబ్రేషన్ వీడియోని అప్ లోడ్ చేసింది. విక్రమ్ వాళ్ళ అమ్మ కోసం టు కేక్స్ ఆర్డర్ చేసి తెప్పించాడు. అందరూ మేడ మీదకు వెళ్లి కేక్ కట్ సెలెబ్రేట్ చేసుకున్నారు. విక్రమ్ వాళ్ళ అమ్మ బర్త్ డే సందర్భంగా ఆమెకు ఎంతో ఇష్టమైన కలర్ సారీ తీసుకుని ప్రెజెంట్ చేసాడు. ఇక వాళ్ళ ఇంట్లో పెంచుకునే కుక్కపిల్ల మైక్ కి కూడా ఆమె కేక్ తినిపించింది.

మా అత్తమ్మ రోజూ మైక్ కి అన్నం తినిపిస్తేనే తింటుంది లేదంటే తినదు అని చెప్పింది శ్రీవాణి. "నాకు మా అమ్మకు చిన్నప్పటినుంచి మూవీస్ చూడడం అంటే చాల ఇష్టం. ఏ లాంగ్వేజ్ మూవీ వచ్చినా చూసేస్తూ ఉంటాం. అందుకే చిన్నప్పటినుంచి మాకు ఇలా కేక్ కట్టింగ్స్ కానీ ఇలాంటి సెలెబ్రేషన్స్ అంటే చాలా ఇష్టం అన్నాడు విక్రమ్ తర్వాత వాళ్ళ ముత్తాత ఫోటో చూపించాడు ఆ ఫోటోకి వందేళ్లు" అని చెప్పాడు. అలా విక్రమ్ వాళ్ళ అమ్మ 60 వ పుట్టినరోజు పండగను తనకు తెలిసిన వాళ్ళ మధ్య గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసాడు.