Read more!

English | Telugu

నెటిజన్లు చేసిన కామెంట్స్ కి ఘాటుగా సమాధానమిచ్చిన యాంకర్ రవి!

యాంకర్ రవి.. యాంకరింగ్ లో ఒక ట్రెండ్ సెట్ చేసిన రవి అందరికి సుపరిచితమే. టీవీ షోస్, ఈవెంట్స్ లలో బిజీగా ఉంటోన్న రవి.. ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరగా ఉంటూ వస్తున్నాడు. 'సంథింగ్ స్పెషల్' అంటూ కెరీర్ స్టార్ట్ చేసిన రవి.. ఆ షోతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. అప్పట్లో రవి ఫాలోయింగ్ బాగుండేది. రవి ఆ షో చేస్తుంటే లైవ్ లో తనకి కాల్ చేసి మరీ.. మ్యారేజ్ చేసుకోమని అడిగేవారు.. అప్పట్లో రవికి అంత క్రేజ్ ఉండేది.

ఆ తర్వాత బిగ్ బాస్-5 లో ఎంట్రీ ఇచ్చిన రవికి.. హౌస్ లో పాజిటివ్ ఇంప్రషన్ కన్నా నెగటివ్ ఇంప్రెషనే ఎక్కువ వచ్చింది‌. ఏం వచ్చిన  ఫేమ్ అయితే వచ్చిందనే చెప్పాలి. రవి ఎంట్రీతో బిగ్ బాస్ విన్నర్ అతనే అని మొదట్లో అనిపించినా.. తను లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ అతను బిహేవ్ చేసిన దానికి... అదంతా తలకిందులై.. అనుకోకుండా రవి బయటికొచ్చేసాడు. తను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు జరిగిన ఫ్యామిలీ వీక్ లో.. రవి ఫ్యామిలీ వచ్చినప్పుడు ఎమోషనల్ గా సాగిన ఎపిసోడ్.. మోస్ట్ ఎమోషనల్ ఎపిసోడ్ ఇన్ బిగ్ బాస్ గా చెప్పుకోవచ్చు. రవి యాంకరింగ్ అంటేనే ఎనర్జిటిక్ గా ఉంటుంది. ప్రేక్షకులను సైతం తన మాటలతో ఉత్తేజపరుస్తాడు. సమ్మర్ వచ్చిందంటే చాలు.. కొందరు సెలబ్రెటీస్.. చిన్న పెద్ద తేడా లేకుండా సమ్మర్ వేకేషన్ అంటూ బయట విదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తున్నారు. ఇప్పుడు అదే బాటలో యాంకర్ రవి కూడా నడుస్తున్నడు. ఎప్పుడు షోస్, ఈవెంట్స్ తో బిజీగా ఉండే రవి సమ్మర్ వెకేషన్ అంటూ మలేషియా వెళ్ళాడు. దానికి సంబంధించిన కొన్ని ఫొటోస్ ని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసాడు. పోయేది వేరే దేశమని కాబోలు విచిత్రమైన వేషధారణతో విమానం ఎక్కాడు రవి. అయితే రవి తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఆ ఫొటోస్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. రవి పోస్ట్ చేసిన ఈ ఫోటోస్ చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చెయ్యగా.. వాళ్ళకి రవి ఘాటుగానే సమాధానమిచ్చాడని చెప్పాలి.

ఆ ఫొటోస్ చుసిన నెటిజన్లలో ఒకరు.. అచ్చం గంగిరెద్దొనిలాగా ఉన్నావ్.. పక్కన ఒక గంగిరెద్దు  ఉంటే మస్త్ ఉంటుండే అని కామెంట్ చెయ్యగ.‌.  "వచ్చేయ్ మరి నా పక్కకు" అంటూ రవి సమాధానమిచ్చాడు. "అంతా ఒకే గాని ఆ  ప్యాంటుకి  బొక్కలు ఎందుకని" మరొకరు కామెంట్ చెయ్యగా.. సమ్మర్ కదా.. చల్లగాలి కోసమంటూ రవి సమాధానమిచ్చాడు. బిగ్ బాస్ నుండి అవే చెప్పులు వాడుతున్నావా? ఎన్ని రోజులు వేస్తావ్ మామ అని ఒకరు అడుగగా.. నాతో ఉన్నంతకాలం అవే చెప్పులు వేస్తానని సమాధానమిచ్చాడు రవి.. ఒకరు అయితే ఈ ఫొటోస్ ని చూసి.. "లంగా అనుకున్నాను బ్రో" అని కామెంట్ చేయగా.. ఎక్కువ దేనిగురించి ఆలోచిస్తే అవే కన్పిస్తాయి బ్రో అంటూ కామెంట్ చేసాడు రవి. దీంతో ఇలా రవి చేసిన కామెంట్స్ కి విశేష స్పందన వస్తోంది. ఒక్కసారిగా యాంకర్ రవి ఇన్ స్టాగ్రామ్ లో హాట్ టాపిక్ గా మారాడు. కాగా రవి చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.