Read more!

English | Telugu

ఈ క్రికెట్ పదాలను తెలుగులో ఏమంటారో తెలుసా?


వెన్నెల కిషోర్ అంటే చాలు కామెడీకి కేరాఫ్ అడ్రెస్ గా చెప్పొచ్చు. కిషోర్ డైలాగ్ చెప్పే అవసరం లేకుండానే ఆయన ఫేస్ చూస్తే చాలు నవ్వొచ్చేస్తుంది. అలాంటి కిషోర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక కిషోర్ రీసెంట్ గా స్టార్ స్పోర్ట్స్ తెలుగు షోలో మెరిశాడు. ఐతే కొంత మంది స్టార్స్ ని తీసుకొచ్చి క్రికెట్ టెర్మినాలజీ వర్డ్స్ ని తెలుగులో  ఎం అంటారో  తెలుసుకునే సెగ్మెంట్...ఇంగ్లీష్ పదాలను అచ్చంగా తెలుగులోకి అనువదించడం చాలా కష్టం.

ఒకవేళా అలా అనువదిస్తే గనక పిచ్చ కామెడీగా ఉంటాయి ఆ పదాలు. అవి చదివినా, విన్నా కూడా కడుపుబ్బా నవ్వొస్తుంది. మరి కిషోర్ కూడా కొన్ని క్రికెట్ పదాలకు అలాంటి ఆన్సర్స్ ఇచ్చాడు. ఈ షోకి హోస్ట్ గా చేస్తున్న నందుకి ఈ సెగ్మెంట్ ఎంత ఇష్టం అని చెప్పాడు. అలా తన షోకి వచ్చిన కిషోర్ తో ఈ పదాలకు అర్దాలు చెప్పించాడు. మొదటి ప్రశ్నగా "స్ట్రైక్ రేట్ ని తెలుగులో ఎం చెప్పొచ్చు" అని నందు అడిగేసరికి "ఉద్యమం యొక్క వెల" అని అచ్చ తెలుగులో కిషోర్ ఆన్సర్ ఇచ్చాడు. "నో బాల్" అంటే "బాల్ లేదు..బాల్ లేదు" అని చెప్పాడు. "డ్రెస్సింగ్ రూమ్" అంటే "బట్టలు మార్చుకునే గది" అని చెప్పాడు. "వికెట్ కీపర్" అంటే "వికెట్లను ముందు వుంచుకునేవాడు" అని కిషోర్ చెప్పేసరికి "వికెట్లను అసలు తెలుగులో ఏమంటారు" అని అడిగాడు నందు. "కర్రలు అంటే కర్రలను ముందు ఉంచుకునేవాడు" అని కామెడీగా చెప్పాడు. "ఫ్రీ హిట్" అంటే "ఉచితంగా కొట్టడం" అని కిషోర్ చెప్పిన ఆన్సర్ కి నందు పడీ పడీ నవ్వేసాడు. నందు గురించి చెప్పుకుంటే అటు బుల్లితెర మీద ఢీ షోకి హోస్ట్ గా,  ఇటు వెబ్ సిరీస్ లో నెగటివ్ రోల్స్ లో నటిస్తూ, క్రికెట్ కామెంటేటర్ గా దూసుకుపోతున్నాడు. వెన్నెల కిషోర్ సిల్వర్ స్క్రీన్ మీద  నవ్వించే  పాత్రల్లో కనిపిస్తూ అలరిస్తున్నాడు. రీసెంట్ గా చారి 111 మూవీలో నటించాడు.