Read more!

English | Telugu

అనుష్కకు అసిస్టెంట్ గా అవకాశం ఇచ్చిన జానీ మాస్టర్...


ఢీ షో ఈ వారం ఎపిసోడ్ డాన్స్ లవర్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఒక్కో కంటెస్టెంట్ ఒక్కో రేంజ్ లో బిందాస్ పెర్ఫార్మెన్సెస్ తో అలరించారు. ఏ ఒక్కరిది తక్కువ పెర్ఫార్మెన్స్ అని కాకుండా అందరూ ఇరగదీసేసారు. ఇక ఈ షోకి కంటెస్టెంట్స్ ఫామిలీ మెంబర్స్ అంతా వచ్చారు. ఆది, నందు అందరూ కలిసి వాళ్ళతో డాన్స్ లు చేయించారు. శ్వేతా నాయుడు ఐతే "మాష్టారు మాష్టారు" అంటూ జానీమాస్టర్ కోసం పాట కూడా పడింది. లాస్ట్ లో సాత్విక్ టీమ్ అద్దిరిపోయే డాన్స్ చేశారు.

అందులో ఒక లేడీ కంటెస్టెంట్ అనుష్క రోబోలా చేసిన డాన్స్ కి అందరూ ఫిదా ఇపోయారు. జడ్జెస్ కూడా ఆమె చాలా మెచ్చుకున్నారు. జానీ మాస్టర్ ఐతే స్టేజి మీద ఆమెకు ఒక ప్రామిస్ కూడా చేసేసారు. శివ మాస్టర్ ని తెగ పొగిడేశారు. "అనుష్కా ఈ సాంగ్ మొత్తానికి నువ్వే హీరో, హీరోయిన్ అన్నీ నువ్వే..చాలా చాలా బాగా చేసావ్.. చదువుకుంటున్నావా" అని అడిగారు. "ఇంటర్ చదువుకుంటున్నాను" అని చెప్పింది అనుష్క. "బాగా చదువు.. పూర్తయ్యాక.. నీకో ఫోన్ వస్తుంది" అని చెప్పాడు. ఆ మాటకు అనుష్క స్టేజి మీద ఏడ్చేసింది. "అనుష్క ఏడవకు..చాలా బాగా చేసావ్..ఈ స్టేజి మీదే మాటిస్తున్నాను. నాకు అసిస్టెంట్ గా నువ్వు ఉంటావ్. వరుణ్ థావన్ నెక్స్ట్ మూవీలో అసిస్టెంట్ గా నేను నీకు అవకాశం ఇస్తాను. ఆది ఈ షోలో అందరి జాతకాలు చెప్పి ఫుల్ ఎంటర్టైన్ చేసాడు.