Read more!

English | Telugu

రాత్రంతా రిషి గదిలో ఉండిపోయిన వసుధార!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'.. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-695 లో.... జగతి, మహేంద్రలు కలిసి రిషి గదిలో ఉంటారు.  ఆ తర్వాత కాసేపటికి రిషి తన గదిలోకి వచ్చేసరికి వాళ్ళిద్దరు ఉండడంతో..  "ఏదో పెద్ద విషయమే ఉందనుకుంటా" అని రిషి అంటాడు.. నీకు నిజం తెలిసింది ఇంకా మరి వసుధార అంటే ఎందుకు అంత కోపం.. ఎందుకు దూరం పెడుతున్నావ్? అయిందేందో అయింది.. అపార్థాలు అన్నీ తొలగిపోయాయి కదా అని మహేంద్ర అడుగుతాడు. "నాకు వసుధార మీద కోపం తగ్గలేదు.. తనకి దూరంగా ఉండలేను అలా అని దగ్గర చేసుకోలేను.. అయినా మీరు కూడా నన్ను మోసం చేశారు కదా.. మీ మీద కూడా కోపం ఉంది" అని చెప్పేసి రిషి అక్కడ నుండి వెళ్ళిపోతాడు.

ఇక లోపలగదిలో వాళ్ళంతా మాట్లాడుకునే మాటలన్నీ చాటుగా వింటుంది దేవయాని. బయటకొచ్చి దేవయానిని చూస్తారు జగతి, మహేంద్రలు. "ఎంత సేపు నిలుచుంటారు అక్కయ్యా.. కాళ్ళు నొప్పిగా లేవా" అని జగతి వెటకారంగా అంటుంది. నేనేం వినలేదు.. ఇప్పుడే వచ్చాను అని కోపంగా దేవయాని అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరోవైపు రిషి, వసుధారల ఛాటింగ్ చేసుకుంటారు. ఇక ఛాటింగ్ మధ్యలో తల నొప్పిగా ఉందని రిషి అనగానే.. అల్లం టీ తాగండని వసుధార మెసేజ్ చేస్తుంది. అలాగే ఛాటింగ్ చేసుకుంటూ రిషి పడుకుంటాడు. ఉదయం రిషి దగ్గరికి మహేంద్ర వచ్చేసరికి తనకి జ్వరం వచ్చి ఉంటుంది. అప్పుడే రిషికి వసుధార కాల్ చెయ్యడంతో.. మహేంద్ర కాల్ లిఫ్ట్ చేసి.. "రిషికి జ్వరం వచ్చిందమ్మా" అని మహేంద్ర అనగానే.. రిషి దగ్గరికి తొందరగా వస్తుంది వసుధార. రిషి పక్కనే ఉన్న దేవయాని.. "ప్రాజెక్ట్ లు అంటూ అటుఇటు తిప్పారు.. ఎవరు రిషిని పట్టించుకోరు.. జ్వరం ఎలా వచ్చిందో చూడంటి" అని అంటూ నటిస్తుంది. అలా మొదలు పెట్టగానే వసుధార వచ్చి.. "మేడం మీరు రిషి సర్ దగ్గర నుండి లేవండి.. రిషి సర్ కి జ్వరం తగ్గాలని మీకు ఉంటే బయటకు వెళ్ళండి" అని వసుధార అనగానే అక్కడ నుండి వెళ్ళిపోతుంది దేవాయాని. 

ఇక వసుధార, రిషి పక్కనే ఉండి తన బాగోగులు చూసుకుంటుంది. ఆ రోజు రాత్రి నుండి మరుసటి రోజు ఉదయం వరకు రిషి పక్కనే ఉంటుంది వసుధార. అలా రాత్రంతా ఉన్న వసుధారని చూసిన రిషి.. "రాత్రంతా ఇక్కడే ఉన్నావా" అని రిషి అడుగుతాడు.. "మీరు ఇక్కడ ఇలా ఉంటే.. నేను అక్కడ ఎలా ఉంటాను సర్" అని వసుధార అంటుంది. థాంక్స్  వసుధార అని రిషి అనగానే.. "మీరు నేను వేరు కాదు సర్.. మనమిద్దరం ఒక్కటే" అని వసుధార అంటుంది. సర్ బ్రష్ చెయ్యండి కాఫీ తెస్తాను అంటూ వసుధార వెళ్తుండగా.. దేవయాని తనని కోపంగా చూస్తుంది. మేడం మీక్కూడా కాఫీ తెస్తానని దేవయానితో చెప్పి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.