Read more!

English | Telugu

ముకుందపై భవానీ ఫైర్.. ఢిల్లీ టూర్ క్యాన్సిల్!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'.. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్‌-89 లో..  ఆదర్శ్ గురించి మురారి, ముకుందలని  ఢిల్లీ వెళ్ళమని భవానీ చెప్తుంది. ఆ తర్వాత కృష్ణని కూడా తీసుకొని వెళ్ళమని రేవతి అంటుంది. అప్పుడు మురారి.. అమ్మ మేము వెళ్ళేది ఆదర్శ్ ను వెతకడానికి, మాతో కృష్ణ ఎందుకని అంటాడు. మురారి అలా అనగానే నువ్వు కచ్చితంగా కృష్ణని తీసుకొని వెళ్ళాలని రేవతి చెప్తుంది. దానికి మురారి ఒప్పుకుంటాడు. కృష్ణ మాత్రం.. "వద్దు అత్తయ్యా" అని అనగానే.. నువ్వు నోరు మూసుకో కాసేపు అని రేవతి కోప్పడుతుంది.. మురారి టికెట్స్ బుక్ చెయ్.. మీ ఇద్దరికి పక్క పక్క సీట్స్ బుక్ చెయ్.. ముకుందకి వెనకాల సీట్ బుక్ చెయ్ అని దగ్గర ఉండి టికెట్ బుక్ చేయిస్తుంది రేవతి. ఇక త్వరగా పడుకోండి తొందరగా లేవాలి కదా అని చెప్పేసి అక్కడ నుండి వెళ్తుంది రేవతి..

మరుసటి రోజు ఉదయం.. ముందుగా రెడీ అయి తన లగేజ్ పట్టుకొని మురారి కోసం ఎదురుచూస్తుంటుంది ముకుంద.. ఇన్ని రోజులు ఏ ప్లాన్ చేసిన నాకు అడ్డుపడే రేవతి అత్తయ్య ఇప్పుడు మాత్రం నాకు అడ్డుపడలేదని ముకుంద తన మనసులో అనుకుంటూ సంతోషపడుతుంది. ఇక అక్కడే ఉన్న రేవతి, ముకుందని చూసి.. "అప్పుడే సంతోషపడకు ముకుందా"అని మనసులో అనుకుంటుంది. తర్వాత మురారి వచ్చి కృష్ణ కోసం వెయిట్ చేస్తాడు. ఇక కృష్ణ కూడా తన లగేజ్ తో రావడంతో.. ముకుంద షాక్ అవుతుంది.  అలా  కృష్ణ కూడా తన లగేజీతో రావడం భవానీ చూస్తుంది. "కృష్ణని కూడా పంపిస్తున్నావా రేవతి" అని భవాని అడుగుతుంది. "అవును అక్కా.. మొన్న హనీమూన్ కూడా క్యాన్సిల్ అయింది కదా.. ఆదర్శ్ ను వెతుకుతూ.. ఖాళీ ఉన్న టైంలో కృష్ణ, మురారిలు సరదాగా అలా బయటికి వెళ్తారని రేవతి అంటుంది. అంటే వీరిద్దరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే నేను ఒక పక్కన కూర్చొని ఏడుస్తూ ఉండాలా అని ముకుంద అనగానే.. భవాని కోపంగా ముకుందని తిడుతుంది.  "స్టాప్ ఇట్.. నా తోటికోడలిని ఇలా విమర్శించడమేంటి" అని  అడుగుతుంది. ఇక మురారి కూడా.. "మా అమ్మని అలా ఎందుకు అంటున్నావ్" అని అడగడంతో ముకుంద ఏడుస్తూ తన గదిలోకి వెళ్తుంది. 

ముకుంద ప్లాన్ ని తిప్పికొట్టినట్లుగా రేవతి భావిస్తుంది. ఆ తర్వాత ఢిల్లీ టూర్ క్యాన్సిల్ అవుతుంది. అంతకముందు ఈ ఇంట్లో అందరూ నా మాట వినేవాళ్ళే.. ఈ తింగరిపిల్ల వచ్చినప్పటి నుండే ఇలా జరుగుతుందని భవాని అంటుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.