Read more!

English | Telugu

అటు నువ్వే ఇటు నువ్వే అంటూ రిషి.. ఆనందంలో వసుధార!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -787 లో... రిషి కాలేజీకి వెళ్తాడు. రిషిని చుసిన కేడి బ్యాచ్.. మళ్ళీ వీడు వచ్చాడేంటని అనుకుంటారు. లెక్చరర్ గా వచ్చాడేమో వీడి సంగతి చూడాలి.. నిన్న మనం ఏం చేసినా వర్క్ అవుట్ కాలేదు కానీ ఈ రోజు ఆలా కాకూడదు అని కేడి బ్యాచ్ లోని వాళ్ళంతా అనుకుంటారు.

ఆ తర్వాత వసుధార ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి.. సర్ నిన్న ఒక సర్ వచ్చి కేడి బ్యాచ్ కి బుద్ది చెప్పారంట కదా అని అడుగుతుంది. అవును మేడం సర్ ఇప్పుడు కాలేజీకి వస్తున్నారు లెక్చరర్ గా.. ఈ కాలేజీ లోనే జాయిన్ అయ్యారని ప్రిన్సిపాల్ చెప్తాడు.. సర్ పేరు రిషి అని చెప్పగానే.. వసుధార నా రిషి సర్ ఏనా అని అనుకుంటుంది. రిషి సర్ వస్తున్నాడని తెలిసి వసుధార ఎక్సయిట్ మెంట్ తో ఎదురుగా వెళ్తుంది. వసుధార వెళ్తుంటే సడన్ గా రిషిని చూడకుండా డాష్ ఇస్తుంది. ఆ తర్వాత ఇద్దరు ఒకరికొకరు చూసుకొని షాక్ అవుతారు. వసుధార మాత్రం ఇన్ని రోజులు రిషి సర్ పై దాచుకున్న ప్రేమని చెప్తూ హగ్ చేసుకున్నట్లు ఉహించుకుంటుంది.

ఆ తర్వాత రిషి సైలెంట్ గా చూస్తూ ఉండిపోతాడు. ఇంకొక మేడం వచ్చి.. మేడం రిషి సర్ ని అలానే చూస్తున్నారేంటి మీకు ముందే తెలుసా అని వసుధారని అడుగుతుంది. సర్ కొత్తగా లెక్చరర్ గా జాయిన్ అయ్యారని ఆ మేడం వసుధారతో చెప్తుంది. ఈ మేడం ఈ కాలేజీ లెక్చరర్ అని వసుధారని రిషికి పరిచయం చేస్తుంది ఆ మేడం. రిషి మాత్రం సైలెంట్ గా ఉంటాడు. వసుధార గతంలో రిషి అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. వసుధారతో రిషి మాట్లాడకుండా సైలెంట్ గా వెనక్కి  వెళ్ళిపోతాడు. సర్ ఆగండి అంటూ రిషి వెనకాల వసుధార వెళ్ళిపోతుంది. రిషి కార్ లో వెళ్ళిపోతాడు.ఆ తర్వాత వసుధార ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన వసుధారని వాళ్ళ నాన్న చక్రపాణి చూసి.. ఏంటీ వసుధార ఈ రోజు తొందరగా వచ్చిందని అనుకుంటాడు. ఏమైందని వసుధారని చక్రపాణి అడుగగా.. కాలేజీకి రిషి సర్ వచ్చాడని చెప్పగానే చక్రపాణి షాక్ అవుతాడు. మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం నేను ఉన్నా దగ్గర రిషి సర్ ఉండడు.. రిషి సర్ వెళ్ళకముందే మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం నాన్న. రిషి సర్ ఎక్కడికి వెళ్ళకూడదు. ఆ కాలేజీలో స్టూడెంట్స్ కి బుద్ది చెప్పడానికి రిషి సర్ కావాలి. రిషి సర్ అడ్రెస్ ఎక్కడో అని చైర్మన్ గారిని అడగాలని వసుధార అంటుంది.

ఆ తర్వాత రిషి సర్ వెళ్లిపోయాడని మహేంద్ర సర్ ఎంత బాధపడుతున్నాడో.. ఈ విషయం మహేంద్ర సర్ కి ఫోన్ చేసి చేప్తానని వసుధార అనుకొని..  మహేంద్రకి ఫోన్ చేస్తుంది. వెంటనే చక్రపాణి వచ్చి ఫోన్ కట్ చేస్తాడు. నువ్వు చెప్పావని మహేంద్ర సర్ వచ్చి రిషిని చూస్తే మళ్ళీ ఎక్కడికి అయిన వెళ్ళిపోతాడని చక్రపాణి అంటాడు. ఆ తర్వాత మహేంద్ర  అతని ఫోన్ చూసుకొని మిస్డ్ కాల్ ఉందేటని వసుధారకి రిటర్న్  చేస్తాడు..

ఆ ఫోన్ చక్రపాణి లిఫ్ట్ చేసి.. ఎవరని అడుగుతారు. మీరెవరు అని మహేంద్ర అడుగుతాడు. చక్రపాణి అని అనగానే.. అంటే వసుధార చేసిందా అని మహేంద్ర అనుకుంటాడు. చక్రపాణి దగ్గర నుండి వసుధార ఫోన్ తీసుకొని.. కట్ చేస్తుంది. అవతలివైపు ఫోన్లో మాట్లాడుతుంది మహేంద్ర సర్ అని చక్రపాణితో అంటుంది వసుధార. వసుధార ఫోన్ ఎందుకు చేసిందో అని మళ్ళీ మహేంద్ర కాల్ చేస్తాడు. వసు లిఫ్ట్ చేస్తుంది. వసుధార ఎందుకు కాల్ చేసావ్ అని మహేంద్ర అనగానే.. పక్కనే ఉన్న జగతి వసుధారనా అని మహేంద్ర దగ్గరికి వచ్చి అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.