Read more!

English | Telugu

మజ్జిగను ఎలా వండాలో సర్కార్ వంటల ప్రోగ్రాంలో చెప్పిన వర్షిణి


సర్కార్ సీజన్ 3 ఈవారం ఎపిసోడ్ లేడీస్ ఎంట్రీతో మంచి జోష్ గా కలర్ ఫుల్ గా మారిపోయింది. ఇందులో అనన్య నాగళ్ళ, అనన్య, ప్రియా వడ్లమాని, వర్షిణి వచ్చారు. రావడం రావడమే ప్రదీప్ చేతిలో బుక్ ఇపోయారు. "ప్రాణం లేకపోయినా ఎక్కువ కాలం జీవించే జీవి ఏది" అనేసరికి "జీవి అంటే ఏమిటి అని వర్షిణి, క్లూ ఇవ్వండి అంటూ అనన్య అడిగేసరికి నేను చెప్పా కదా ఆడియన్స్ ..ప్రశ్నకు ప్రశ్న అడుగుతారని" వాళ్ళే వీళ్ళు అంటూ ఈ నలుగురిని చూపించి అందరినీ నవ్వించాడు. "అసలు ప్రాణమే లేనప్పుడు అసలు జీవి ఎలా అవుతుంది" అన్నాడు ప్రదీప్..దాంతో మేము ఆన్సర్ కరెక్ట్ గానే చెప్పాం కానీ నీ క్వశ్చన్ రాంగ్" అన్నారు నలుగురు లేడీస్.

తర్వాత వర్షిణితో కలిసి కాసేపు ఫన్ చేసాడు ప్రదీప్. "వెల్కమ్ టు సర్కార్ వంటల కార్యక్రమం" అంటూ స్టార్ట్ చేసింది వర్షిణి. "మేడం మజ్జిగ వండారా ఎప్పుడైనా" అని ప్రదీప్ అడగడంతో "అంటే యెల్లోదా, వైట్ దా" అని రివర్స్ లో అడిగేసరికి ప్రదీప్ ఏడుపు ముఖం పెట్టేసాడు. "బాదం పాలు అనుకుంటుంది ఈవిడా" అన్నాడు. "అంటే ఆనియన్స్ వేస్తారు కదా అది" అని వర్షిణి చెప్పేసరికి "ఓహ్ అదీ..దాన్ని మజ్జిగ పులుసు అంటారు" అన్నాడు. "ఈరోజు మజ్జిగ ఎలా వండుతారో తెలుసుకోబోతున్నాం" అని చెప్పాడు. "మజ్జిగ చేయాలంటే ముందుగా మనం ఒక బర్రెను తెచ్చుకోవాలి..దాన్నుంచి పాలు తీసుకుని గిన్నెలో పోసుకుని స్టవ్ పెట్టి బాగా మరిగించుకోవాలి తర్వాత దాన్ని ఫ్రిజ్ లో పెట్టుకోవాలి తర్వాత తీసి చూస్తే పెరుగు రెడీ" అని చెప్పింది. "కాచిన పాలల్లో కొంచెం తోడు చుక్క వేస్తె అది రెండో రోజుకు పెరుగవుతుంది" అని చెప్పాడు ప్రదీప్ అని చెప్పడంతో..."నా దగ్గర టు ప్రాసెస్ ఉన్నాయి..అందులో ఒక ప్రాసెస్ చెప్పాను..నాకు బాగా వచ్చింది..మీరు కూడా ట్రై చేయండి" అని చెప్పింది వర్షిణి.