Read more!

English | Telugu

రాహుల్-స్వప్నల శోభనం రోజు ఏం జరిగింది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -126 లో.. స్వప్న గురించి కావ్య టెన్షన్ పడుతుంది. అప్పుడే రాజ్ తన చేతిలో ఒక కత్తి పట్టుకొని వస్తుంటాడు. అలా రాజ్ వస్తుంటే కావ్య బయపడుతుంది. స్వప్న గురించి నిజం తెలిసి ఇలా వస్తున్నాడా అని కావ్య తన మనసులో భయపడుతుంది. ఇద్దరు ఎప్పటిలాగే నువ్వా, నేనా అన్నట్లు పొట్లాడుకుంటారు.

మరొకవైపు రాజ్ వెళ్తుండగా ధాన్యలక్ష్మి పిలుస్తుంది. నువ్వు నీ విషయంలో జోక్యం చేసుకోకని చెప్పావ్. ఇప్పటి వరకు జోక్యం చేసుకోలేదు కానీ ఇప్పుడు జోక్యం చేసుకుంటాను. ఎందుకంటే నువ్వు నా కొడుకువి కాబట్టి.. కావ్య, నువ్వు కలసి అందరి ముందు సరదాగా ఉంటే అందరూ మీరు సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నారు. కాకపోతే అది నిజం కాదు.. నువ్వు కావ్యని భార్యగా ఆక్సెప్ట్ చెయ్యాలి. కావ్య కూడా తన భర్తతో సంతోషంగా ఉండాలని ఆశపడుతుందని ధాన్యలక్ష్మి వెళ్ళిపోతుంది. రాజ్ మాత్రం సైలెంట్ గా ఉంటాడు. మరొక వైపు రాహుల్ శోభనం గదిలోకి వచ్చి.. ఛీఛీ ఈ స్వప్న తో నాకు శోభనమేంటి? ఉహించుకుంటేనే ఎలానో ఉంది.

ఆ  వెన్నెలతో పెళ్లి యూరప్ లో, హనీమూన్ పారిస్ లో ఇలా ఎన్ని ఉహించుకున్నానో.. నా ప్లాన్ అంత నాశనం చేసింది. పైగా తనని మోసం చేసానని అందరి ముందు పరువుతీసిందని రాహుల్ అనుకుంటాడు. అప్పుడే స్వప్న పాలగ్లాస్ తో లోపలికి వస్తుంది. ఎలాగైనా లేని కడుపుని నిజం చేసుకోవాలి. అంతవరకు రాహుల్ తో ఇంట్లో వాళ్ళతో మంచిగా ఉండాలని స్వప్న అనుకుంటుంది. స్వప్న నేను నిన్ను చాలా బాధపెట్టాను. ఇవ్వన్నీ డిస్టబెన్స్ లో ఇదంతా ఎందుకు.. నాకు కొంచెం టైమ్ కావాలని రాహుల్ అంటాడు. ఇదేంటి రాహుల్ రివర్స్ మాట్లాడుతున్నాడని స్వప్న అనుకుని.. సరే రాహుల్ నీకు నచ్చినట్టు ఉందామని స్వప్న అంటుంది. ఎలాగైనా రాహుల్ ని నాకు అనుగుణంగా మర్చుకోవాలని అనుకుంటుంది స్వప్న.

మరొక వైపు  తన గదిలోకి కావ్య పాల గ్లాస్ తో వచ్చినట్లు రాజ్ ఉహించుకుంటాడు. అప్పుడు కావ్య వచ్చి.. ఏంటి ఏదో ఆలోచిస్తున్నట్లున్నారని అంటుంది. ఏం లేదులే వెళ్లి పడుకోమని రాజ్ అంటాడు. మరొక వైపు ఉదయం రాహుల్ దగ్గరికి ధాన్యలక్ష్మి వచ్చి.. ఇంత ప్రొద్దున్నే లేచావ్.. స్వప్న లేచేసరికి వెళ్లి కాఫీ కలుపుకొని వెళ్ళమని ధాన్యలక్ష్మి అంటుంది. చిరాకుగానే సరే అని రాహుల్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.