English | Telugu

ఏపీ, తెలంగాణ‌లో ఎక్క‌డ టికెట్ ఇచ్చినా ఎమ్మెల్యేగా పోటీ చేస్తా!

తెలుగు రాష్ట్రాల్లో 'కార్తీకదీపం' వంటలక్క అలియాస్ దీప అలియాస్‌ ప్రేమి విశ్వనాథ్ కు ఉన్న ఫాలోయింగ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. స్టార్ హీరోలు, హీరోయిన్ల రేంజ్ లో పాపులారిటీ దక్కించుకుంది వంటలక్క. సాధారణంగా సీరియల్స్ అంటే గృహిణులు మాత్రమే చూస్తారని అనుకుంటారు కానీ 'కార్తీకదీపం' సీరియల్ ను ఇంటిల్లిపాదీ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా ప్రేమి విశ్వనాథ్ రాజకీయాలపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

కేరళకు చెందిన ఈమెకు తన సొంత రాష్ట్రమైన కేరళ రాజకీయాలపై అంత ఇంట్రెస్ట్ లేదంట కానీ.. తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రెడీ అంటోంది. ఆమె సరదాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. 'కార్తీకదీపం' సీరియల్ లొకేషన్ కు సంబంధించిన వీడియోలను యూట్యూబ్ ఛానెల్ లో షేర్ చేస్తుండగా.. తాజా వీడియోలో ప్రేమి విశ్వనాథ్, ఈ సీరియల్ నిర్మాత గుత్తా వెంకటేశ్వరావు సరదాగా ముచ్చట్లు పెట్టుకున్నారు. మధ్యలో వీరు పాలిటిక్స్ గురించి మాట్లాడుకున్నారు.

కేరళలో మా పార్టీ బంపర్ విక్టరీ కొట్టిందని చెప్పింది ప్రేమి విశ్వనాథ్. "మరి నీకు నెక్స్ట్ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా.?" అని అడిగాడు నిర్మాత. "ఎమ్మెల్యేనా నాకు పాలిటిక్స్ ఇంట్రస్ట్ లేదు సార్" అని చెప్పింది ప్రేమి విశ్వనాథ్. "కేరళ సంగతి వదిలేయ్.. ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పోటీ చేస్తావా..?" అని నిర్మాత అడగగా.. "హా.. టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా" అని చెప్పింది వంటలక్క. మరి ఏ పార్టీలో చేరతావని అడిగితే.. "అది మాత్రం చేరినప్పుడు చెప్తా." అంటూ తెలివిగా సమాధానం ఇచ్చింది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.