Read more!

English | Telugu

బిగ్ బాస్-7లోకి ఉదయభాను వెళ్ళనుందా!

యాంకర్ ఉదయభాను.. ఈ పేరు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే. ఒక్కప్పుడు ఏ సినిమా ఆడియో ఫంక్షన్ అయిన  ఉదయభాను ఉండాల్సిందే.‌ ఏ షో అయిన తను సందడి చెయ్యాల్సిందే అన్నట్లుగా ఉదయభాను క్రేజ్ ఉండేది. ఒకప్పుడు అన్ని ఛానెల్లకు మోస్ట్ ఛాయస్ గా ఉదయభాను ఉండేది. తన అందంతో అభినయంతో ప్రేక్షకులను సంపాదించుకుంది. లీడర్ లో 'రాజశేఖర ' సాంగ్ లో కన్పించిన ఉదయభాను, ఆ తర్వాత జులాయి మూవీలో  ఐటమ్ సాంగ్ లో మళ్ళీ మెరసింది. అప్పట్లో రెండు మూడు సినిమాల్లో కనిపించి అందరిని మెప్పించింది. ఉదయభాను పెళ్లి చేసుకొని ఇద్దరి కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కాగా కొంత కాలం బుల్లి తెరకి దూరంగా  ఉంది.

ఉదయభాను  సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది. రీసెంట్ గా ఒక షో కి యాంకర్ గా చేసింది. ఇన్ని రోజులు ఫాన్స్ కి దూరంగా ఉన్నా ఇప్పుడు ఫ్యాన్స్ కి దగ్గర ఉండాలనుకుంది కాబోలు.. తనపేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసింది. అందులో తనకి సంబంధించిన ప్రతీ విషయాన్ని వ్లాగ్ ల రూపంలో చేస్తూ వస్తుంది. అయితే మళ్ళీ ఫేమ్ రావాలనుకుంటున్న ఉదయభాను.. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తాజా సమాచారం. అయితే తను బిగ్ బాస్-7 లోకి  సింగిల్ గా కాకుండా తన భర్తతో కలిసి జోడీగా కూడా వెళ్తున్నట్లు  తెలుస్తోంది.‌ అయితే బిగ్ బాస్ లో కపుల్స్ వెళ్లడం కొత్తేమీ కాదు.. బిగ్ బాస్-3 లో వరుణ్ సందేశ్ అతని భార్య వితిక ఎంట్రీ ఇచ్చి ఎంటర్టైన్ చేసిన విషయం తెలిసిందే. అలాగే బిగ్ బాస్- 6 లో మెరీనా -రోహిత్ లు ఎంట్రీ ఇచ్చి వినోదాన్ని పంచిన విషయం అందరికీ తెలిసిందే. అయితే బిగ్ బాస్ సీజన్-7 లోకి వెళ్ళే జోడీలలో.. తాజాగా రెండు జంటల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఒక జంట అమరదీప్ -తేజస్విని గౌడ కాగా, మరొక జంట ఉదయభాను-అజయ్. అయితే అమర్ దీప్-తేజస్విని గౌడ రీసెంట్ గా మ్యారేజ్ చేసుకున్న కపుల్స్. వీరి పెళ్ళికి బుల్లితెర నటీనటులంతా హాజరవ్వడంతో ఈ జంట మంచి పాపులారిటీని సంపాదించుకుంది. 

అయితే ఈ సీజన్ లో ఉదయభాను-విజయ్ లు  బిగ్ బాస్ లో ఎంట్రీ ఇస్తారా?‌ ఈ షోలోకి తనకి అవకాశం వస్తే ఉదయభాను మళ్ళీ ఫామ్ లోమి వచ్చేస్తుందనే  తెలుస్తుంది. కాగా తాజాగా ఉదయభాను బిగ్ బాస్ సీజన్-7లోకి వెళ్తుందనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీళ్ళే కాకుండా మరి ఏ జోడి ఈ సారి బిగ్ బాస్ లోకి వెళ్తారో? ఆ గోల్డెన్ ఛాన్స్ ఏ కపుల్స్ ని వరిస్తుందో చూడాలి మరి.