English | Telugu

Podharillu : చక్రిని చంపడానికి రౌడీలతో వెళ్ళిన ఆది.. మహా ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -31 లో.... మహాని చక్రి పెళ్లి చేసుకొని వాళ్ళింటికి బయల్దేరతాడు. ఇంకా ఎంత దూరం.‌. అసలు మీ వాళ్ళు మనల్ని ఇంట్లోకి రానిస్తారా అని మహా అడుగుతుంది. ఆ రోజు అన్నీ మా కుటుంబం గురించి కల్పించి చెప్పాను కానీ ఇప్పుడు ఏం అంటుందోనని చక్రి భయపడుతాడు. మనం జరగదని అనుకున్నప్పుడు ఏవేవో చెప్తాము కానీ అది జరిగినప్పుడు చెప్పినవన్ని మర్చిపోవాలని చక్రి సంబంధం లేకుండా మాట్లాడుతాడు. మీరు మీ ఇంటికి దగ్గరగా వెళ్తున్నారు. నేను మా ఇంటికి దూరంగా వెళ్తున్నానని మహా బాధపడుతుంది.

మరొకవైపు ప్రతాప్ ఇంటికి వెళ్తాడు. మహా ఎక్కడ అండి అని లలిత అడుగుతుంది. ప్రతాప్ వాటర్ తలపై పోసుకొని.. నాకు కూతురు లేదని లోపలికి వెళ్తాడు. దాంతో అందరు షాక్ అవుతారు. అసలు ఏమైందని లలిత అడుగగా పెళ్లి అయింది. ఆ డ్రైవర్ తో లేచిపోయిందని భూషణ్ చెప్తాడు. అంటే మమ్మల్ని మీరు అంతా మోసం చేసారా అని భూషణ్ పేరెంట్స్ ప్రతాప్ ని తిడుతారు. చక్రి, మహా పెళ్లి చేసుకున్న ఫోటోని భూషణ్ చూపించగనే హారిక, లలిత షాక్ అవుతారు. ప్రతాప్ మౌనంగా లోపలికి వెళ్తాడు. మరొకవైపు చక్రి ఇంటి ముందు తన అన్నదమ్ములు సందడి చేస్తుంటే తాయారు, గాయత్రి అటుగా వెళ్తు చూస్తారు. ఏంటో కనుక్కొని రమ్మని గాయత్రిని తాయారు పంపిస్తుంది. గాయత్రి వెళ్ళగానే అక్కడున్న కన్నా.. మా అన్న పెళ్లి చేసుకున్నాడని చెప్తాడు. దాంతో మాధవ అనుకొని గాయత్రి ఏడుస్తుంది. అప్పుడే మాధవ వచ్చి నేను కాదు చక్రి అని చెప్తాడు.

మరొకవైపు మహా ఇంత మోసం చేస్తుందనుకోలేదని లలిత తన ఫోటో చూస్తూ ఏడుస్తుంది. అల్లుడు గారు ఎక్కడ అని హారిక వాళ్ళ అమ్మ అడుగుతుంది. అవును ఇంకా రాలేదని ఆదికి హారిక ఫోన్ చేస్తుంది కానీ ఫోన్ కలవదు. ఆది ఆ చక్రిని ఏమైనా చెయ్యడానికి వెళ్లాడా అని హారిక భయపడుతుంది. మరొకవైపు చక్రిని చంపడానికి రౌడీలతో చక్రి ఇంటికి బయల్దేర్తాడు ఆది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.