Read more!

English | Telugu

మిడ్ నైట్ మసాలా కోసం తాగుబోతు రమేష్ గొడవ!

జబర్దస్త్ ఎవ్రీ వీక్ ఏదో ఒక విధంగా నవ్వులు కురిపించడానికి ట్రై చేస్తోంది. కానీ ఇంతకు ముందు ఉన్న ఫన్, కామెడీ ఐతే ఉండడం లేదు..కానీ స్కిట్స్ మధ్యలో ఈ మూవీ ప్రొమోషన్స్ టీమ్స్ వస్తూండేసరికి వాళ్ళ వలన కొంచెం కామెడీ అనేది కవర్ అవుతోంది. ఇక ఈ వారం కూడా అలాగే జరిగింది. జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి "నారాయణ అండ్ కో" టీం ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ముందుగా రాకెట్ రాఘవ స్కిట్ పెర్ఫార్మ్ చేసాడు. వీళ్ళ టీం మొత్తం జెపిల్ ఆడారు. ఐతే జెపిఎల్ అంటే జబర్దస్త్ ప్రీమియర్ లీగ్ అని కూడా క్లారిటీ ఇచ్చాడు రాఘవ. టాస్ వెయ్యి అని రాఘవ అనేసరికి "తడా, పొడా" అని నాగి కౌంటర్ వేసాడు. ఛి ఏమిటా మాటలు ..మనమేమన్నా చింత చెట్ల కింద ఆడుతున్నామా  అన్నాడు రాఘవ.

"వెదర్ ఎలా ఉంది అని రాఘవ అడిగేసరికి పది మార్కులు కూడా వచ్చేలా లేవు" అన్నాడు. తర్వాత తాగుబోతు రమేష్ టీమ్ స్కిట్ వేశారు.."ఆ కిరాణా షాప్ వాడితో గొడవ ఏమిటి అండి" అని రమేష్ భార్య అడిగేసరికి "ఇక్కడ అన్ని మసాలాలు అమ్మబడును అని వుంది కదా అని మిడ్ నైట్ మసాలా ఇవ్వండి" అని అడిగాను అనేసరికి అందరూ నవ్వేశారు. మధ్యలో వెంకీ మంకీస్ ఎంట్రీ ఇచ్చి "మొన్న దేవీ ప్రసాద్ గారు ఏమన్నారో తెలుసా ..వెంకీ నీకోసం ఒక కథ రాసాను హీరో చేద్దాం అన్నారు.." అని చెప్పాడు "నీలాంటి వాళ్ళ యాక్టింగ్ చూడలేకే యాక్టింగ్ ఎక్కడ చచ్చిపోతుందో అని చెప్పి డైరెక్టరే యాక్టర్ అయ్యాడు" అన్నాడు తాగుబోతు రమేష్. తర్వాత సద్దాం టీం దసరా మూవీ స్పూఫ్ చేసి ఫుల్ కామెడీ పంచారు. తర్వాత నారాయణ అండ్ కో మూవీ టీం నుంచి హీరో సుధాకర్ స్టేజి మీదకు వచ్చి డాన్స్ చేసాడు.