Read more!

English | Telugu

యూట్యూబ్ ట్రెండింగ్ లోని వెబ్ సిరీస్ లు..!

ఒకప్పుడు షార్ట్ ఫిల్మ్ లతో యూట్యూబ్ నిండుగా ఉండేది. ‌ఇప్పుడేమో వెబ్ సిరీస్ లు, డాక్యుమెంటరీ చిత్రాలు, షార్ట్స్, వ్కాగ్స్ అంటు సెలెబ్రిటీల నుండి కామన్ పీపుల్స్ వరకు తమకి తోచింది చేసేస్తున్నారు. 

అయితే యూట్యూబ్ లో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న వెబ్ సిరీస్ లు ఓసారి చూసేద్దాం.. పెళ్ళి వారమండి, సీక్రెట్ కపుల్, ఏయ్ అమాయిక .. ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి. యూత్ ని అట్రాక్ట్ చేసే లవ్ సీన్స్, ఎమోషనల్ డైలాగ్స్, ఫ్యామిలీ రిలేషన్స్ లాంటి అంశాలపై తీసిన వెబ్ సిరీస్ లు ఈ మధ్య హిట్లు గా నిలుస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం షార్ట్ ఫిల్మ్ లతో యూత్ కాలం గడిపేవారు. కానీ ఇప్పుడు ఎవరికీ అంత ఓపిక ఉండట్లేదు. నిమిషాల్లోనే కథ అర్థమవ్వాలి, ముగిసిపోవాలి. 'మా విడాకులు' వెబ్ సిరీస్ తో ప్రసాద్ బెహరా, విరాజిత యూట్యూబ్ లో ఓ ట్రెండ్ సెట్ చేశారు. ప్రసాద్‌ బెహరా కామెడీ టైమింగ్ , డైలాగ్ డెలివరీ కోసం ఎంతోమంది నెటిజన్లు తను చేసిన ఈ మా విడాకులు వెబ్ సిరీస్ లోని అన్ని ఎపిసోడ్ లని చూసి ఆదరించారు. ఇప్పుడు అదేవిధంగా  విరాజిత, ప్రసాద్ బెహరా, ఇంకా కొంతమంది కలిసి ' పెళ్ళి వారమండి' అనే వెబ్ సిరీస్ ని స్టార్ట్ చేశారు.

ప్రసాద్ బెహరా, విరాజిత, జెడీవీ ప్రసాద్, శ్వేత ఘట్టమనేని, ఎప్సిబా, చందు ఛార్మ్స్, హర్షిణి బల్ల, శృతి రావు, చందు జేసీ, అక్షయ్ మదన్, శ్రీ కుమారి ముఖ్య పాత్రలుగా సాగుతున్న ఈ ' పెళ్ళి వారమండి' వెబ్ సిరీస్ కి రచన, దర్శకత్వం ప్రసాద్ బెహరా..  ఇప్పటికే  ఈ సిరీస్‌ ఎనిమిది ఎపిసోడ్ లు విడుదలయ్యాయి. ప్రతీ ఎపిసోడ్ మినిమమ్ ఇరవై లక్షల పైచిలుకు వ్యూస్ ని పొందింది. అయితే మరి అంతగా ఏం ఉందంటే.. ఆఫీస్ లో బాస్ లై సెటైర్లు వేయడం, టీమ్ లీడర్లపై అలక, ఫ్రెండ్లీ నేచర్.. సహజసిద్ధమైన శైలీ.. కామెడీతో యూత్ ని అట్రాక్ట్ చేస్తున్నారు మేకర్స్. మరి మీలో ఎంతమంది ఈ వెబ్ సిరీస్ ని చూశారు. యూట్యూబ్ లో మీకు తెలిసిన మీరు రెగ్యులర్ గా చూసే సిరీస్ లు, చూసిన సిరీస్ లు ఏంటో కామెంట్ చేయండి.