Read more!

English | Telugu

Brahmamudi : ధాన్యలక్ష్మికి సూపర్ వార్నింగ్ ఇచ్చిన కనకం.. బాబుకి అక్కడ పుట్టుమచ్చ ఉందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -376 లో.. అప్పుని ఏడిపించిన బ్రోకర్ సంగతి కళ్యాణ్ మీడియా పోలీసుల ముందు బయటపెడతాడు. ఆడవాళ్లతో ఇలా ప్రవర్తిస్తేనే వాళ్ళు వెనకడుగు వేస్తున్నారని కళ్యాణ్ అంటాడు. మరొకవైపు ఫోన్ లో కళ్యాణ్ ఆ బ్రోకర్ ని కొట్టడం రుద్రాణి చూసి.. టైమ్ కి భళే దొరికిందని అనుకుంటుంది.

ఆ తర్వాత ఆ న్యూస్ రుద్రాణి తీసుకొని వెళ్ళి అందరికి చెప్తుంది. నీ కొడుకుని సూట్ లో ఆఫీస్ కి వెళ్తుంటే చూడాలనుకున్నవ్ కానీ నీ కొడుకు రోడ్డుపై గొడవలకి దిగుతున్నాడంటూ.. ఫోన్ లో వచ్చే న్యూస్ ని ధాన్యలక్ష్మికి రుద్రాణి చూపిస్తుంది. ఆ అప్పుకి సిగ్గు లేదు.. నేను వాడితో తిరుగోద్దని అంటుంటే తిరుగుతుంది. వాళ్ళింటికి వెళ్లి గొడవ చేసినా సిగ్గు లేదని ధాన్యలక్ష్మి అంటుంది. ఇప్పుడు వెళ్లి మళ్ళీ అడుగని రుద్రాణి అనగానే.. వాల్లనే రప్పించి.. ఇక నా కొడుకు జోలికి రావద్దని చెప్తాను అందరి ముందు చెప్తానని ధాన్యలక్ష్మి అంటుంది‌. కనకంకి ధాన్యలక్ష్మి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తుంది. ధాన్యలక్ష్మి ఇంటికి రమ్మని చెప్పడం తో.. కనకం టెన్షన్ పడుతూ అప్పుకి ఫోన్ చేసి ధాన్యలక్ష్మి రమ్మని ఫోన్ చేసింది రమ్మని చెప్తుంది. ఆ తర్వాత ధాన్యలక్ష్మి వాళ్ళు రాకముందే ఇంట్లో గొడవ స్టార్ట్ చేస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా ఆ అప్పు నా కొడుకుతో తిరుగుతుందంటు ధాన్యలక్ష్మి తిడుతుంది. అప్పుడే కనకం, కృష్ణమూర్తి  అక్కడికి వస్తారు. ఇక వాళ్ళని ధాన్యలక్ష్మి రెచ్చిపోయి తిడుతుంది. అప్పుడే కళ్యాణ్, అప్పులు వస్తారు. అప్పుని ఏడిపించారు కాబట్టి కొట్టానని కళ్యాణ్ చెప్తాడు. నా కూతురిని ఇంకొకసారి ఎవరైనా అంటే బాగోదని కనకం వార్నింగ్ ఇస్తుంది. నా ఫుల్ సపోర్ట్ నీకే అంటీ అని కళ్యాణ్ కూడా కనకం వైపు మాట్లాడతాడు.

ఆ తర్వాత కావ్య దగ్గరికి ఇందిరాదేవి వచ్చి.. నువ్వు వెళ్లిన పని ఏమైందని అడుగుతుంది. అప్పుడే కళ్యాణ్ వచ్చి.. ఏమైనా హెల్ప్ చెయ్యాలా అని అడుగుతాడు. అవసరం ఉన్నప్పుడు నువ్వు కాకుండా నాకు ఎవరు ఉన్నారని కావ్య అంటుంది. నువ్వు ఇప్పుడు ఆ బాబు తల్లిని తీసుకొని వస్తే.. ఇంట్లో నీ పరిస్థితి ఏంటని ఆలోచించావా అని కావ్యని ఇందిరాదేవి అడుగుతుంది. తరువాయి భాగంలో బాబు నడుము దగ్గర పుట్టుమచ్చ చూసిన రుద్రాణి.. రాజ్ కి కూడా అక్కడే ఉందని కావ్యకి రుద్రాణి చెప్తుంది. దాంతో రాజ్ కి నడుము దగ్గర పుట్టుమచ్చ ఉందా లేదా అని కావ్య చూడాలనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.