English | Telugu
Bigg Boss 9 Telugu Tanuja : టికెట్ టూ ఫినాలే రేస్ నుండి తనూజ అవుట్.. వెక్కి వెక్కి ఏడ్చిందిగా!
Updated : Dec 4, 2025
బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి చేరుకుంది. ప్రస్తుతం హౌస్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. టికెట్ టూ ఫినాలే కోసం టాస్క్ లు జరుగుతున్నాయి. అందులో భాగంగా ముగ్గురు సెలెక్ట్ చేసుకొని ఒక టాస్క్ ఆడతారు. అందులో గెలిచి వాళ్లకు సంబంధించిన గడులని గెలుస్తారు. వాళ్ళు ఎవరితో పోటి పడాలో సెలెక్ట్ చేసుకోవాలని బిగ్ బాస్ చెప్తాడు. తనూజ, భరణి, డీమాన్ ముగ్గురు టాస్క్ ఆడగ అందులో తనూజ గెలిచి తన పక్క గడి పొందుతుంది. తనతో పోటీపడడానికి సుమన్ ని సెలెక్ట్ చేస్తుంది.
వాళ్ళు ఒక తాడు పట్టుకొని ఉంటారు. వాళ్ళపై ఒక క్యాన్ ఉంటుంది. బజర్ మోగినప్పుడు సంఛాలక్ ఒకరికి పిలుస్తారు. మళ్ళీ బజర్ మోగినప్పుడు సంఛాలక్ పిలిచిన వాళ్ళు ట్యాప్ ఆన్ చేసి మళ్ళీ బజర్ మోగినప్పుడు అఫ్ చెయ్యాలి. అలా ఎక్కువ క్యాన్ నిండి వాటర్ బయటకు వస్తాయో.. వాళ్ళు టాస్క్ నుండి అవుట్ అవుతారు. అలా తనూజ క్యాన్ లో వాటర్ పొసేందుకు రెండుసార్లు సుమన్ కి భరణి సపోర్ట్ చేస్తూ తనూజ ట్యాప్ ఆన్ చేస్తాడు. సుమన్ కి సపోర్ట్ గా డీమాన్, భరణి ఉంటారు. తనూజకి సపోర్ట్ గా మిగతా వాళ్ళు ఉంటారు. సంఛాలక్ గా సంజన ఉంటుంది.
ఈ టాస్క్ లో తనూజ బ్యాలెన్స్ ఆపలేక తాడుని వదిలేస్తుంది. ఈ టాస్క్ విన్నర్ సుమన్ కాబట్టి తనూజ గడులని సుమన్ గెలుచుకుంటాడు. తనూజ టికెట్ టూ ఫినాలే రేస్ నుండి తప్పుకుంటుంది. టాస్క్ ఓడిపోయినందుకు తనూజ ఏడుస్తుంది. భరణి తనకి సపోర్ట్ చెయ్యలేదని ఏడుస్తుందనుకొని తనూజ దగ్గరికి వస్తాడు. నీకు హౌస్ అంతా సపోర్ట్ ఉన్నారు కానీ సుమన్ మొన్న ఏడుస్తూ నాకు సపోర్ట్ ఎవరు లేరన్నారు అందుకే సపోర్ట్ చేసానని వివరిస్తాడు. తనూజ ఇదంతా అర్థం చేసుకుంటుందా లేక భరణికి తర్వాతి గేమ్ లో సపోర్ట్ చేయకుండా ఉంటుందా చూడాలి మరి.