Read more!

English | Telugu

 అమ్మ ఒడి కాదు అత్త ఒడి అనే పథకాన్ని మొదలుపెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా

 


డ్రామా జూనియర్స్ సీజన్ సిక్స్ మెగా లాంచ్ ఆడిషన్స్ దుమ్మురేపాయి..పిల్లలా వాళ్ళు కాదు పిడుగులే అన్నట్టుగా ఉంది పోటాపోటీ పెర్ఫార్మెన్సులు..  ఈ షోలో ఫస్ట్ లిటిల్ కంటెస్టెంట్ గా హైదరాబాద్ నుంచి స్నిగ్ద అత్తగారి గెటప్ లో వచ్చి అలనాటి అత్తగారు భానుమతిని గుర్తుచేసింది. రావడం రావడమే ప్రదీప్ మీద పంచులు కురిపించింది. "ఏడ్చావులే ఎర్రిసచ్చినోడా...వెనకటికి నీలాంటోడే రాఖీ పండగ అంటే రామ్ గోపాల్ వర్మతో సెలెబ్రేట్ చేసుకోమన్నాడట..ఐనా నీకేం తెలుసులే మా అత్తల గురించి..ఓ పెళ్లా పెటాకులా" అనేసరికి "ఇలాంటి అత్తలు ఉంటారనే పెళ్లి చేసుకోవడం" లేదు అని కౌంటర్ వేసాడు.

"గడసరి అత్త..సొగసరి కోడలా" ఏ "సొగసరి అత్త..గడసరి కోడలు" అనొచ్చుగా. ఆఖరికి మా అత్తలకు సీరియల్స్ విషయంలో కూడా అన్యాయమే జరుగుతోంది. "నంబర్ వన్ కోడలు..నా కోడలు బంగారం" అని తీశారు ఈ జీ తెలుగు వాళ్ళు. ఏ "నంబర్ వన్ అత్త..నా అత్త బంగారం" అని తియ్యొచ్చుగా. "తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు కదా మరి అక్కడ అత్త ఏది అంట..ఈ లిస్ట్ లో అత్తను కూడా చేర్చాలని..వెంటనే జిఓ పాస్ చేయాలనీ కోరుతున్నా...మదర్స్ డే, ఫాథర్స్ డే మాత్రమే కాదు అత్తల డే అని కూడా పెట్టాలని,  అమ్మ ఒడి కాదు అత్త ఒడి అనే పథకాన్ని కూడా మొదలుపెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా..కోరడం కాదు ఆర్డర్ చేస్తున్నా.

రాజమౌళి మూవీస్ లో కన్నా అత్తల్ని మరీ దారుణంగా చూపిస్తున్నారు. అత్తల్ని బాగా బాడ్ చేసేసారు. అత్తాకోడళ్ళన్నాక గొడవలు ఉంటాయి. అంతమాత్రానికే మమ్మల్ని విల్లన్లను చేసేస్తారా ఏమిటి. మాతృదేవోభవ, పితృదేవోభవ అన్నట్టే అత్త దేవోభవ అని కూడా అనండి..అంతేకాని ఈ మాటను చనువుగా తీసుకుని అత్తల్ని తక్కువ చేయాలనీ చూసినా, తక్కువగా మాట్లాడినా మళ్ళీ వస్తా" అంటూ సోలో పెర్ఫార్మెన్స్ తో షోలో రచ్చ చేసింది. జడ్జెస్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చేసింది. "అత్త రోల్ లో సూర్యకాంతం గారు చేసినట్టు ఇంకెవ్వరూ చేయలేరు. ఆ విరుపులు, కరుపులు..చాలా బాగా చేసావ్" అంటూ జడ్జెస్ మెచ్చుకుని స్నిగ్దని సెలెక్ట్ చేసేసారు.