English | Telugu

శ్రీ‌ముఖి, విష్ణు ప్రియ.. గోవా బీచ్‌లో క‌లిసి చేస్తున్న‌ది ఇదా?!

గ‌త నాలుగు రోజుల క్రితం నుంచీ బుల్లితెర రాముల‌మ్మ శ్రీ‌ముఖి గోవాలో చ‌క్క‌ర్లు కొడుతున్న విష‌యం తెలిసిందే. అక్క‌డి బీచ్ హోట‌ల్‌లో హొయ‌లు పోతూ శ్రీ‌ముఖి చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. వాట‌ర్ ఫాల్స్‌లో దిగి త‌డిపొడి దుస్తుల్లో అందాలు ఆర‌బోస్తూ శ్రీ‌ముఖి ర‌చ్చ చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇటీవ‌ల ఇన్ స్టాలో సంద‌డి చేసిన విష‌యం తెలిసిందే.

శ్రీ‌ముఖికి తొడు విష్ణుప్రియ కూడా గోవా వెళ్లింది. అక్క‌డ శ్రీ‌ముఖితో క‌లిసి త‌ను కూడా ర‌చ్చ చేస్తోంది. అయితే గోవా బీచ్‌లో శ్రీ‌ముఖి, విష్ణుప్రియ చేసిన ఓ ప‌ని ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారింది. శ్రీ‌ముఖి త‌న క్రైమ్ పార్ట‌న‌ర్‌ అంటూ ఈ సంద‌ర్భంగా విష్ణు ప్రియ స్టేట్‌మెంట్ కూడా ఇవ్వ‌డం మ‌రింత హీటెక్కిస్తోంది. ఇంత‌కీ శ్రీ‌ముఖితో క‌లిసి విష్ణు ప్రియ చేసిన క్రైమ్ ఏంటీ ? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

గోవా బీచ్‌లో గ‌త నాలుగు రోజులుగా తెగ ఎంజాయ్ చేస్తున్న ఈ జోడీ నైట్ డిన్న‌ర్ చేస్తూ హ‌గ్ చేసుకున్న ఫొటోల‌తో పాటు బీచ్‌లో ఇసుక‌పై కూర్చుని ఒక‌రి నొక‌రు గాఢంగా హ‌త్తుకున్న ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజ‌న్స్ బీచ్‌లో ఇదేం పాడుప‌ని అంటూ కామెంట్‌లు కురిపిస్తున్నారు. ఈ కామెంట్‌ల‌ని శ్రీ‌ముఖి, విష్ణు ప్రియ సీరియ‌స్‌గా తీసుకోకుండా ఎంజాయ్ చేస్తుండ‌టం విశేషం.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.