Read more!

English | Telugu

సౌజన్యరావు, రిషి మధ్య ఛాలెంజ్.. గెలుపెవరిది?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-744 లో.. రిషి ఇంట్లో లేని టైం చూసుకొని సౌజన్యరావు వాళ్ళింటికి వస్తాడు. అక్కడ మహేంద్ర, ఫణీంద్ర భూషణ్, దేవయానిలతో డీల్ గురించి చెప్తాడు. నేనొక ప్రపోజల్ తో వచ్చాను. మా కాలేజీనే మీ DBST కాలేజీలో కలుపుకోండి.. మీరు ఇంకా కొత్తగా మెడికల్ కాలేజీ కూడా కట్టనవసరం లేదు.. లైసెన్స్ కూడా తీసుకోనవసరం లేదు.. మా కాలేజీని మీ DBST కాలేజీలో మెర్జ్ చేస్తున్నట్టు చెప్తే సరిపోతుందని వాళ్ళ(మహేంద్ర,ఫణీంద్ర, దేవయాని)తో సౌజన్యరావు చెప్తాడు. దాంతో ఫణీంద్ర ఆలోచిస్తాడు.. సరే ఈ విషయం మాకెందుకు చెప్తున్నారు డైరెక్ట్ గా రిషీతోనే మాట్లాడితే సరిపోయేది కదా అని ఫణీంద్ర అడుగుతాడు. రిషి యంగ్ .. ఉడుకు రక్తం.. మొన్న అలా మాట్లాడినందుకే ఇలా చేసాడు. మళ్ళీ ఈ ప్రపోజల్ గురించి చెప్తే నా గుండు మీద కొడతాడని సౌజన్యరావు చెప్తాడు. అందరూ ఆలోచిస్తుంటారు. సరే మీరు రిషీతో మాట్లాడి నాకు ఏ విషయం చెప్పండని చెప్పి సౌజన్యరావు వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత రిషీ వచ్చి దేవయాని గురించి అడుగగా.. తనకి బాలేక పడుకుందని ధరణి చెప్తుంది. అది విని దేవయాని గదికి వెళ్ళిన రిషి.. ఏంటి పెద్దమ్మ ఏం అయింది.. జ్వరం వచ్చిందా.. మామూలుగానే ఉన్నావ్ గా అని అడుగగా.. నాకేమైతే ఏముందిలే అని దేవయాని అంటుంది. అదేంటి పెద్దమ్మ మీకు బాగోకపోతే మేం ఎలా బాగుంటామని రిషి అంటాడు. నాకెలాగూ ఈ ఇంట్లో సంతోషం లేదు.. మీరైనా సంతోషంగా ఉండండని నటిస్తుంది దేవయాని. ఏం జరిగిందో చెప్పండని రిషి అడుగగా.. నేనెప్పుడూ నీకు లాభం చేకూరాలని చూస్తా, ఇంట్లో వాళ్ళు నిన్ను నా మాట విననివ్వరు. ఇందాకా ఆ సౌజన్యరావు వచ్చాడు. మీ నాన్న, పెద్దనాన్నతో మాట్లాడాడు.. అతని ప్రపోజల్ గురించి చెప్పాడు. ‌రూపాయి పెట్టుబడి లేకుండా అన్ని పనులు జరిగిపోతాయని చెప్తుంది దేవయాని. ఆ తర్వాత డాడ్ పెద్దనాన్న అని గట్టిగా పిలుస్తాడు రిషి. మీరంతా ఎందుకు పెద్దమ్మ మాట వినట్లేదు.‌ మీ వల్ల తను ఎంత బాధపడుతున్నారో తెలుసా.. ఎటువంటి ప్రయాస లేకుండా మెడికల్ కాలేజ్ కి ప్రయోజనం జరుగుతుంది. మీరంతా నాకు నష్టం కలిగించాలని చూస్తున్నారు. పెద్దమ్మే ది బెస్ట్ అని రిషి చెప్తాడు. అది విని దేవయాని తనలో తానే నవ్వుకుంటుంది. ఆ తర్వాత తను కంటున్న కల నుంచి బయటకు వచ్చేసి.. అంటే రిషి నన్ను పొగిడిందంతా నా భ్రమా అని అనుకుంటుంది. నాతో మాట్లాడాలని చెప్పారు కదా థాంక్స్ డాడ్, పెద్దనాన్న అని రిషి అంటాడు. ఈ విషయంలోనే కాదు.‌ కాలేజీ విషయంలో ఏదైనా నీదే ఫైనల్ డెసిషన్ అని ఫణీంద్ర అంటాడు. మన అందరి మాట ఒకటే అని చెప్పకనే చెప్పారు ‌.. మనం ఎప్పుడూ ఇలానే ఉండాలని రిషి అంటాడు.

ఆ తర్వాత కాలేజీ దగ్గర సౌజన్యరావు రిషి కోసం ఎదురుచూస్తుంటాడు. ఇంతలో రిషి వచ్చి తన ముందు నుండే వెళ్తుండగా.‌. హలో రిషీ సర్.. మీరు ఇక్కడికి వచ్చారంటే నా ప్రపోజల్ మీకు నచ్చిందనుకుంటా.. చేయి కలపండని సౌజన్యరావు అతని హ్యాండ్ ఇవ్చగా.. ఈ రిషీంద్ర భూషణ్ చేయి కలపాలంటే ఎదుటివారిలో నిజాయితీ ఉండాలని అంటాడు. ఆ తర్వాత రిషీని రెచ్చగొట్టే విధంగా మాట్లాడతాడు సౌజన్యరావు. ఒక ఛాలెంజ్ పెడతాడు. పది రోజుల్లో మీరు మెడిల్ కాలేజీకి పర్మిషన్ తీసుకోండి.. నేను తీసుకుంటాను. మీకు పర్మిషన్ రాకుండా మాకు వస్తే మా కాలేజీలో మీ DBST కాలేజీని కలపాలి‌. అదే మీకు పర్మిషన్ వస్తే మీ DBST కాలేజీలో మా కాలేజీని కలపుతామని అనగా.. సరేనంటాడు రిషి. ఆ తర్వాత కాలేజీలో మహేంద్ర, వసుధార, జగతి, ఫణీంద్ర భూషణ్  ని పిలిచి సౌజన్యరావుకి తనకి మధ్య జరిగిన ఛాలెంజ్ గురించి మాట్లాడతాడు రిషి. అది విని అందరూ షాక్ అవుతారు. అంత తక్కువ టైంలో మెడికల్ కాలేజీకి పర్మిషన్ అంటే కష్టమని వాళ్ళంతా రిషితో అంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.