Read more!

English | Telugu

కొత్త కార్ కొన్న మెహబూబ్ దిల్ సే

మెహబూబ్ బుల్లితెర మీద ఎన్నో షోస్ చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాడు. కవర్ సాంగ్స్ చేస్తూ, షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ లోకి వెళ్ళాక తెలుగు ఆడియన్స్ కి చాలా దగ్గరయ్యాడు. ప్రస్తుతం ఆయన కెరీర్ మంచి స్పీడ్ లోనే వెళ్తోంది. బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక యూట్యూబ్ కంటెంట్ తో ఫుల్ బిజీ అయ్యాడు. అంతలోనే   బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో బీబీ జోడి అనే షో స్టార్ట్ చేసేసరికి  అందులో శ్రీ సత్యతో కలిసి జోడి డాన్స్ పెర్ఫార్మెన్సెస్ తో ఇరగదీసాడు మెహబూబ్. అలాంటి మెహబూబ్ ఈ ఏడాది రంజాన్ మాసంలో మంచి కార్ ని కొన్నాడు. 

ఎక్స్యూవి 700 అనే కార్ కొనుక్కుని దాని ముందు నిలబడి , కూర్చుని ఎన్నో రకాల ఫోజులిస్తూ ఆ పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు మెహబూబ్. కార్ కొన్నందుకు సింగర్ శ్రీరామచంద్ర కామెంట్ చేసాడు "కంగ్రాట్స్ బ్రో...నైస్ కార్" అన్నాడు..అలాగే మరో బుల్లితెర నటి మెహబూబ్ ఫ్రెండ్ శ్వేతా నాయుడు కూడా కామెంట్ పెట్టింది. "సో హ్యాపీ ఫర్ యు...యు డిజర్వ్ దిస్" అంది. అలాగే ఇంకా కొంత మంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఐన జ్యోతక్క, సోహైల్ "కంగ్రాట్యులేషన్స్" అని కామెంట్ చేశారు. అలాగే మెహబూబ్ ఫాన్స్, ఫాలోయర్స్ అంతా కూడా "ఈద్ ముబారక్" అంటూ విష్ చేశారు. 

ఇక మెహబూబ్ లాస్ట్ ఇయర్ తనకు ఎంతో ఇష్టమైన అమ్మీని పోగొట్టుకున్నాడు. తన సక్సెస్ చూడడానికి అమ్మీ లేదు అంటూ ఎమోషనల్ పోస్ట్స్ కూడా పెట్టి చాలా బాధపడ్డాడు. అలాంటి టైంలో అతని ఫ్రెండ్స్ అంతా ధైర్యం చెప్పారు. ఆ టైములో వాళ్ళ అమ్మ గురించి పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది. టిక్‌ టాక్‌ వీడియోస్‌ చేస్తూ,  యూట్యూబ్‌ తో కెరీర్‌ స్టార్ట్ చేసిన మెహబూబ్‌  బిగ్‌ బాస్‌ ఆఫర్‌ అందుకుని ఒక ఫేమ్ సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు ఒక్కొక్కటి కొనుక్కుంటూ సెటిల్ అవుతున్నాడు మెహబూబ్ దిల్ సే.