Read more!

English | Telugu

రిషి, వసుధారలని చీకటి గదిలో బంధించిన రౌడీలు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-735 లో.. రిషి, వసుధార ఇద్దరు కార్లో వెళ్తుండగా.. ఒక అమ్మాయి వాళ్ళ కార్ వెనకాల పరుగెత్తుకుంటూ వస్తుంది. ఆ అమ్మాయి అలా పరుగెత్తుకుంటూ రావడాన్ని కార్ సైడ్ మిర్రర్ లో చూసిన రిషి కార్ ఆపగా.. ఆ అమ్మాయి వచ్చి.. సర్ ఇద్దరు రౌడీలు నన్ను తరుముకుంటూ వస్తున్నారు కాపాడండని రిషితో చెప్తుంది. సరేనని ఆ అమ్మాయిని కార్ లో తీసుకొస్తుంటారు రిషి, వసుధార. మరోవైపు జగతి, మహేంద్ర ఇద్దరు మాట్లాడుకుంటారు. రిషి, వసుధార ఇంకా రాలేదేంటని మహేంద్రని జగతి అడుగగా.. దారిలో ఉన్నారేమో ఒకసారి కాల్ చేయమని చెప్తాడు మహేంద్ర. వద్దు నేను చేయను..  నేను ఫోన్ చేసి వాళ్ళ సంతోషాన్ని దూరం చేయలేనని జగతి చెప్తుంది. అప్పుడే జగతికి వసుధార కాల్ చేసి.‌. మాకు ఒక చిన్న పని పడింది.. రావడానికి లేట్ అవుతుందని చెప్పగా.. సరేనని జగతి చెప్తుంది.

జగతి దగ్గరికి దేవయాని వచ్చి పోన్ లో ఎవరని అడుగగా.. వసుధార ఫోన్ చేసిందని జగతి చెప్పడంతో.. ఏంటంటా అని దేవయాని అడుగుతుంది. వాళ్ళకి రావడానికి లేట్ అవుతుందంట మనల్ని తినమని చెప్పిందని జగతి చెప్పగా.. అదేంటి ఇంకా రావట్లేదా.. నువ్వు విలువలు చెప్పాలి కదా అని జగతిని అంటుంది దేవయాని. మరోవైపు రిషి , వసుధారలు ఆ అమ్మాయిని కార్ లో వాళ్ళింటికి తీసుకొస్తారు. అక్కడికి వచ్చాక కాఫీ తాగి వెళ్ళండని లోపలికి పిలుస్తుంది ఆ అమ్మాయి. లోపలికి వెళ్ళాక వాటర్ ఇచ్చి, మా అమ్మనాన్నలకి పరిచయం చేస్తానని గదిలోకి తీసుకెళ్ళగా అక్కడ రౌడీలు ఉంటారు. ఆ రౌడీలు రిషిని కొట్టి, వసుధారని చంపేస్తామని బెదిరించి వారి కార్ తాళాలని, ఫోన్లని తీసుకొని వారిని ఒక గదిలో పడేసి బయట నుండి తాళం వేస్తారు. ఆ తర్వాత సౌజన్య రావు పరిచయమవుతాడు. కన్నింగ్ ప్లాన్ తో మిమ్మల్ని బంధించాను రిషి.. అధికారం కోసమే ఇలా చేసానని  సౌజన్య రావు ఒక్కడే అనుకుంటాడు.

గదిలో బంధించపడ్డ రిషీ, వసుధార.. అసలు ఎవరు మనల్ని బంధించిందని అనుకుంటూ కాలేజీ వాల్యుయేషన్ లో మనల్ని అనగదొక్కేయాలని చూసారు. ఇప్పుడు కూడా వాళ్ళ వక్రబుద్ది చూపించారని వసుధారతో రిషి అంటాడు. మరోవైపు వాళ్లు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవకూడదు.. వాళ్ళిద్దరూ ఒకేగదిలో ఉన్నట్టుగా మీడియాకి సమాచారాన్ని ఇవ్వండని సౌజన్యరావుకి అతడి బాస్ మెసేజ్ చేస్తాడు. అదే విషయాన్ని రిషి, వసుధార ను బంధించిన ఇంటివద్ద కాపలాగా ఉన్న రౌడీలకు సౌజన్య రావు చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.