Read more!

English | Telugu

జానపద పాటలకి కేరాఫ్ గా కనకవ్వ.. అరవై దాటాక వెలుగులోకి!

 

జీ తెలుగు మహిళల కోసం నిర్వహిస్తున్న షో 'సూపర్ క్వీన్'. ఈ షో మొదటి సీజన్ విజయవంతంగా పూర్తి చేసుకొని.. తాజాగా సీజన్-2 ని స్టార్ట్ చేసింది. దీనికి ప్రదీప్ యాంకర్ గా చేస్తుండగా, గెస్ట్ గా టాలీవుడ్ క్వీన్ కాజల్ అగర్వాల్ వచ్చింది. ఈ సీజన్ పదిమంది కంటెస్టెంట్స్ తో గ్రాండ్ గా మొదలైంది. ఈ కంటెస్టెంట్స్ లలో కొందరు యాక్టింగ్, కొందరు సింగింగ్, మరికొందరు కామెడీకి సంబంధించిన వాళ్ళు.. ఇలా ఎక్కడెక్కడో ఉన్న వీర మహిళలని, ఇన్సిపిరేషన్ గా నిలిచిన మహిళలని తీసుకొచ్చి.. వారు వారి జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను, నష్టాలను అన్నింటిని ఈ షో వెలుగులోకి తెస్తుండంటంతో అత్యధిక వీక్షకాధరణ పొందుతోంది. 

సూపర్ క్వీన్ కి సంబంధించిన లేటేస్ట్ ప్రోమోను తాజాగా విడుదల చేసారు. ఇందులో వచ్చిన ప్రతీ కంటెస్టెంట్ ఎమోషనల్ అవుతూ.. తమ లైఫ్ లో బాధాకరమైన సంఘటన చెప్తూ.. వాళ్ళు ఈ స్థాయికి రావడానికి పడ్డ కష్టాన్ని చెప్తూ ఎమోషనల్ అయ్యారు. అయితే ఈ షోకి యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తున్న సింగర్ కనకవ్వ వచ్చింది. అరవై ఏళ్ళ వయసు దాటాకా పల్లె పాటలు పాడటం ఒకటైతే.. ఆ పాటలకి మంచి ఆదరణ లభించడంతో తెలుగు రాష్ట్రాలలో విపరీతంగా క్రేజ్ ని సంపాదించుకుంది కనుకవ్వ. అరవై ఏళ్ళ వయసులో కెరీర్ స్టార్ట్ చేసింది కనకవ్వ.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఒక పల్లెటూరిలో ఉంటున్న కనుకవ్వకి.‌‌. పాటలతోనే తనకి ఉదయం మొదలవుతుందని చెప్పింది. అచ్చమైన తెలుగు పదాలతో స్వచ్చమైన జానపదాలని జనాలకి అందుబాటులో తెస్తోన్న కనకవ్వకి జనాలు ఫిధా అవుతున్నారు. స్వచ్ఛమైన మనసుతో గాన కోకిలలా పాడుతూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకుంది. కాగా తాజాగా విడుదలైన సూపర్ క్వీన్ షో కి వచ్చిన కనుకవ్వ.. తనకి ఎంతగానో గుర్తింపు తెచ్చిపెట్టిన "ఆడనెమలి " పాటని పాడి వినిపించగా.. స్టేజ్ అంతా విజిల్స్ తో మారుమ్రోగింది. ఆ తర్వాత కనుకవ్వ సూపర్ క్వీన్స్ కి ఇన్స్పిరేషన్ ని ఇచ్చే విధంగా మాట్లాడింది. అరవై ఏండ్ల వరకు మట్టి పిసుక్కుంటూ ఉన్నా..గిట్ల పాటలు పాడుతానని అనుకున్నానా అని కనుకవ్వ అంటుంది. మనం అనుకున్నది సాధించలేమని చాలా మంది అనుకుంటారు.. కానీ ఆమె అరవై తర్వాత తన జీవితం మొదలెట్టిందని ప్రదీప్ అంటాడు.

కనకవ్వ ఈ వయసులో తన సింగింగ్ టాలెంట్ బయటకు రావడం.. దాంతో తను ఫేమస్ అవ్వడం.. ఇలా తను టాలెంట్ కి వయసుకి సంబంధం లేదని నిరూపించింది. ఈ వయసులో తన కెరీర్ ని స్టార్ట్ చేసిన కనుకవ్వ.. గత కొంతకాలంగా జానపద పాటలని పాడుతూ నేటి తరానికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది.