English | Telugu

సొహేల్‌-అరియానా రొమాన్స్‌.. చూడాలి అవినాష్ ఫేస్‌!

జ‌బ‌ర్ద‌స్త్ మాజీ క‌మెడియ‌న్ ముక్కు అవినాష్ ప్ర‌స్తుతం స్టార్ మాలో ప్ర‌సారం అవుతున్నవ‌రుస షోల‌ల్లో క‌నిపిస్తూ ర‌చ్చ చేస్తున్నాడు. అయితే అవినాష్ పూర్తి స్థాయిలో ఆక‌ట్టుకుంటుంన్న కామెడీ షో 'కామెడీ స్టార్స్‌'. ఈ షోకి వ‌ర్షిణి సౌంద‌ర‌రాజ‌న్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా, జ‌డ్జెస్‌గా శేఖ‌ర్ మాస్ట‌ర్‌, న‌టి శ్రీ‌దేవి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ ఆదివారం ఈ షోలోకి స్పెష‌ల్ గెస్ట్‌గా బిగ్ ‌బాస్ సీజ‌న్ 4 కంటెస్టెంట్ సొహేల్‌ ఎంట్రీ ఇస్తున్నాడు.

సొహేల్ హీరోగా, అరియానా హీరోయిన్‌గా అవినాష్ 'క‌థ వేరుంట‌ది' పేరుతో సినిమా చేస్తానంటూ చేసే స్కిట్‌ న‌వ్వులు పూయించేలా వుంది. అరియానా హీరోయిన్ అన‌గానే చ‌ల్ న‌డువ్ అనడం.. వెంట‌నే త‌న‌ని కూల్ చేయ‌డం కోసం "ఏయ్ సింగ‌రేణి ముద్దు బిడ్డా క‌థ వేరుంట‌ది".. అంటూ అవినాష్ కూల్ చేయ‌డం.. "అగ్గిపుల్ల‌ లాంటి ఆడ‌పిల్ల నేనూ".. అంటూ ఇంత‌లో అరియానా ఎంట్రీ.. వెంట‌నే అవినాష్ "ఇదేంట్రా అగ్గిపుల్ల అంటే నిజంగానే అగ్గిపుల్లొచ్చింది".. అన‌డం... ఆ త‌రువాత బిగ్‌ బాస్ హౌస్ త‌రహాలో సొహేల్‌‌, అరియానాల మ‌ధ్య వాడీ వేడీ ర‌చ్చ జ‌ర‌గ‌డం.. మ‌ధ్య‌లో ఇద్ద‌రిని కూల్ చేయ‌డానికి అవినాష్ ఎంట్రీ ఇస్తే అత‌న్ని ప‌క్క‌కు తోసేయ‌డం న‌వ్వులు పూయిస్తోంది.

క‌ట్ చేస్తే సొహేల్‌‌, అరియానా "జ‌న‌వ‌రి మాసం"... అంటూ పాటేసుకోవ‌డం.. ఇద్ద‌రూ రొమాంటిక్ మూడ్‌లోకి వెళ్లిపోయి స్టెప్పులేస్తుండ‌టంతో అవినాష్ ఫేస్‌లో ఎక్స్‌ప్రెష‌న్స్ మారిపోవ‌డం.. అది గ‌మ‌నించి సొహేల్ "అవినాష్‌కి కాలుతోంది" అంటూ డ్యాన్స్ ఆపేయ‌డం ఆక‌ట్టుకుంటోంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.