Read more!

English | Telugu

ముగిసిన అమెరికా టూర్.. ధన్యవాదాలు చెప్పిన సునీత

టాలీవుడ్‌ టాప్ సింగర్స్ లో సునీత ఫుల్ ఫేమస్. తన అద్భుతమైన గాత్రంతో వందల పాటలతో తెలుగు ఆడియన్స్ ని మెప్పించింది. గాత్రమే కాక హీరోయిన్స్ కి పోటీగా  తన అందంతో కూడా అలరిస్తుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది.  తన ఫోటోలు, పాటలు, తన కుమారుడి వీడియోస్ అన్ని షేర్ చేసుకుంటుంది. సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అలరిస్తున్న సునీత ఫేమస్ బిజినెస్ పర్సన్ రామ్‌ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఐతే నెల రోజుల నుంచి అమెరికాలో సునీత మ్యూజిక్ కన్సర్ట్స్ లో పాల్గొని తిరిగి వస్తున్న సందర్భాన్ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసుకుంది.

"నెల రోజుల తర్వాత నేను నా ఇంటికి తిరిగి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.. ఇది ఒక అద్భుతమైన సంగీత ప్రయాణం..అద్భుతంగా సక్సెస్ చేసినందుకు నిర్వాహకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నా మ్యూజిక్ కన్సర్ట్స్ కి హాజరై వాటిని సూపర్ హిట్ చేసిన అమెరికాలో ఉన్న సంగీత ప్రియులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఏప్రిల్ లో ఇలా నా అమెరికా టూర్ ముగిసింది" అని చెప్పింది. ఇక సునీత తన కొడుకు ఆకాష్ ని  హీరోగా చేసి  అతనికి మంచి కెరీర్ ఇవ్వాలని సునీత ప్లాన్ చేస్తోంది. ఇక కూతురు శ్రేయా సింగర్ గా రాణించే దిశగా అడుగులు వేస్తోంది. తన కొడుకు ఆకాష్ కి సంబంధించిన డాన్స్ వీడియోస్ వంటివి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది సింగర్ సునీత.