English | Telugu

ఆడిపాడే బొమ్మలమే కానీ.. స్టేజిపై ఏడ్చేసిన సునీత!

ఈ మధ్యకాలంలో బుల్లితెరపై ప్రసారమవుతోన్న షోలను బాగా ఎమోషనల్‌గా డిజైన్ చేస్తున్నారు. ఎమోషన్ ఎంతగా పండితే ఆడియన్స్ అంతగా షోకి కనెక్ట్ అయిపోతారు. అలా ఇప్పుడు డ్రామా జూనియర్స్ అనే షో ఎమోషన్‌ని బాగా పండిస్తోంది. ఈ షోకి సంబంధించిన ప్రోమోలు ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. 'సరిగమప' షో అయిపోవడంతో ఆ షో స్థానంలో డ్రామా జూనియర్స్ అనే కొత్త షోను మొదలుపెట్టారు. టాలెంట్ ఉన్న చిన్నపిల్లలను తీసుకొచ్చి షో చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి జడ్జిలుగా సింగర్ సునీత, రేణు దేశాయ్, ఎస్వీ కృష్ణారెడ్డి లాంటి సెల‌బ్రిటీల‌ను తీసుకొచ్చారు.

తాజాగా ఈ షోలో ఓ చిన్నారి వేసిన స్కిట్ చూసి చలించిపోయారు జడ్జిలు. సెలబ్రిటీలంటే అందరికీ వారిపై హక్కు ఉంటుందని ఫీల్ అవుతుంటారు. కొన్ని మీడియా సంస్థలు, వెబ్‌సైట్స్ లలో తారలపై రకరకాల రూమర్లు రాస్తుంటారు. ఇదే టాపిక్ తీసుకున్న చిన్నారి.. ఓ స్కిట్ వేసింది. అందులో ఆమె హీరోయిన్ కావాలని కలలు కని.. తన కలను నెరవేర్చుకుంటుంది. తండ్రి వద్దంటున్నా హీరోయిన్ అవుతుంది. అయితే మీడియా ఆమెపై రాసిన తప్పుడు వార్తల వలన తండ్రి విషం తాగి సూసైడ్ చేసుకుంటాడు.

ఈ స్కిట్ చూసిన సునీత తన ఎమోషన్‌ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. స్టేజ్ మీదకు వచ్చి.. ''చాలా కనెక్ట్ అయిపోయాను.. మీకు మేం సెలబ్రిటీలం అవ్వొచ్చు. మీరు మమ్మల్ని ఏమైనా చేయొచ్చు.. సినిమాల్లో ఆడిపాడి బొమ్మలమే కానీ అమ్మలం రా..'' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తరువాత రేణు దేశాయ్ కూడా ఏడ్చేసింది. దయచేసి తప్పుడు వార్తలు రాయొద్దంటూ వేడుకుంది.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.