English | Telugu

ప‌ది రోజుల కొడుకు దేవ్‌యాన్‌ను ప‌రిచ‌యం చేసిన శ్రేయా ఘోష‌ల్‌

గాయ‌ని శ్రేయా ఘోష‌ల్ మే 22న పండంటి బుడ‌త‌డికి జ‌న్మనిచ్చారు. 2015లో బిజినెస్‌మ్యాన్ శిలాదిత్య‌ను ఆమె వివాహం చేసుకున్నారు. త‌మ అనురాగానికి చిహ్నంగా ప‌ది రోజుల క్రితం కొడుకు పుట్ట‌డంతో ఆ దంప‌తుల ఆనందానికి అవ‌ధులు లేవు. శ్రేయా ఘోషల్ తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడారు.

బుధ‌వారం త‌న కొడుకును సోషల్ మీడియా వేదిక ద్వారా అంద‌రికీ ప‌రిచ‌యం చేశారు. భ‌ర్త శిలాదిత్య‌తో క‌లిసి దేవ‌యాన్‌ను చేతుల్లో ఎత్తుకొని ఉన్న ఫొటోను షేర్ చేసిన ఆమె.. దేవ‌యాన్ ముఖోపాధ్యాయ‌గా త‌మ‌ కొడుక్కు పేరు పెట్టిన‌ట్లు వెల్ల‌డించారు. "ఇంట్ర‌డ్యూసింగ్ - దేవ్‌యాన్ ముఖోపాధ్యాయ‌. మే 22న అత‌డు వ‌చ్చాడు. మా జీవితాల్ని పూర్తిగా మార్చేశాడు. పుట్టిన తొలి క్ష‌ణాల‌లో మా హృద‌యాల్లో అత‌ను నింపిన ప్రేమ‌ను కేవ‌లం ఒక త‌ల్లి, ఒక తండ్రి మాత్ర‌మే ఫీల్ కాగ‌ల‌రు. అది స్వ‌చ్ఛ‌మైన అనియంత్రిత అమిత‌మైన ప్రేమ." అని ఆమె రాసుకొచ్చారు.

శ్రేయ‌ తన సంగీత ప్రస్థానాన్ని హిందీ చిత్రం "దేవదాస్"తో ప్రారంభించారు. ఆమెకు ఆ మొదటి చిత్రమే బెస్ట్ సింగ‌ర్‌గా జాతీయ చలనచిత్ర పురస్కారం తెచ్చిపెట్టింది. అలా ఇప్పటికి ఆమెకు 4 జాతీయ పురస్కారాలు, 5 ఉత్తరాది ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, 4 దక్షిణాది ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు లభించాయి.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.