Read more!

English | Telugu

షబీనాస్ హోమ్ మేడ్ హలీం స్టాల్ కి రిబ్బన్ కట్ చేసిన రామ్ ప్రసాద్

ఈరోజు చదువు ఉన్న వాళ్ళు కావొచ్చు లేని వాళ్ళు కావొచ్చు ఎవ్వరైనా సరే సీజనల్ బిజినెస్ లు పెట్టేసుకుంటున్నారు. అలాగే ఫుడ్ బిజినెస్ కూడా పెట్టుకుని చక్కగా రన్ చేసుకుంటూ ఎంతో కొంత లాభాన్ని వెనకేసుకుంటున్నారు. అలాంటి వాళ్లలో మనం ఇప్పటికే చూసాం జబర్దస్త్ నుంచి ఆర్పి బయటకు వచ్చేసి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బ్రాంచెస్ ఓపెన్ చేసాడు. మంచిగా క్లిక్ అవడంతో వీలైనన్ని చోట్ల పెట్టేస్తూ వచ్చాడు. ఇక ఇప్పుడు బుల్లితెర నటి షబీనా కూడా అదే దారిలో ఏదో చిన్న బిజినెస్ ని పెట్టుకుంది. చిన్న ఫుడ్ స్టాల్ ని ఏర్పాటు చేసుకుంది. అందులోనూ ఇది రంజాన్ మాసం. ముస్లిం సోదరులు ఎక్కువగా హలీం తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఆ డిమాండ్ ని అంచనా వేసుకున్న ఆమె "షబీనాస్ హోమ్ మేడ్ హలీం" పేరుతో ఈ స్టాల్ ని ఏర్పాటు చేసింది. ఇక బుల్లితెర మీద జబర్దస్త్ లో చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న ఆటో రాంప్రసాద్ తో స్టాల్ కి రిబ్బన్ కట్ చేయించింది. మటన్ హలీం ఐతే 290 అని చికెన్ ఐతే 190 అని చెప్పింది. ఇక రామ్ ప్రసాద్ బోణి చేసాడు. బిజినెస్ బాగా జరగాలని విష్ చేసాడు. 

ఇక ఈ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది షబీనా. ఇది చూసిన నెటిజన్స్ అంతా లొకేషన్ ఎక్కడో చెప్పవా..వస్తాం..హలీం టేస్ట్ చేస్తాం అని అడుగుతున్నారు. ఆల్ ది బెస్ట్, కంగ్రాట్యులేషన్స్ అని విష్ చేస్తున్నారు. షబీనా బుల్లి తెర మీద షోస్, ఈవెంట్స్ లో కనిపిస్తూ ఉంటుంది. అలాగే కొన్ని సీరియల్స్ లో కూడా నటిస్తూ ఉంటుంది. షబీనా జబర్దస్త్ ద్వారా ఎక్కువగా ఫేమస్ అయింది. అలాగే కస్తూరి సీరియల్ లో చేసింది కొన్ని రోజులే ఐనా కూడా ఆడియన్స్ కి బాగా గుర్తుండిపోయింది. ఆ తరువాత గృహలక్ష్మీ సీరియల్‌లోనూ కొన్ని రోజులు స్పెషల్ కారెక్టర్ వేసింది. ఇక అలా బుల్లితెరపై షబీనాకు మంచి ఇమేజ్ వచ్చింది.