Read more!

English | Telugu

తనకి ఆ నిజం చెప్పేసిన వసుధార..!

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -742 లో.. సౌజన్య రావు చెప్పిన ప్రపోజల్ ని జగతి, వసుధారలు వద్దని చెప్పి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చాక మహేంద్రకి అక్కడ జరిగిందంతా చెప్తారు.. రిషి మెడికల్ కాలేజీ గురించి ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ విషయం ఎలా చెప్పాలని జగతి అంటుంది. ఇది చెప్పి రిషి ఆనందాన్ని ముక్కలు చేసిన వాళ్ళమవుతామని మహేంద్ర అంటాడు. ఆ సౌజన్యరావు ఖచ్చితంగా ఏదో కుట్రతోనే ఈ ప్రపోజల్ తో మన ముందుకి వచ్చాడని వసుధార అంటుంది. రిషి ఎంత బాధపడతాడో అని జగతి అనగానే.. వసుధార అని పిలుచుకుంటూ రిషి లోపలికి వస్తాడు.. వెళ్లిన పని ఏమైంది మేడం.. మీరు ఓకే చేసే ఉంటారు.. నాకు తెలుసని రిషి అంటాడు. వసుధార పదా వెళ్దామని తనని పక్కకి తీసుకొని వెళ్ళి.. రిషికి టైం చూసుకొని సౌజన్యరావు ప్రపోజల్ గురించి చెప్పమని జగతి చెప్తుంది.

వసుధారని తీసుకొని రిషి బండి మీద వెళ్తాడు. వాళ్ళు వెళ్లడం చూసిన దేవయాని.. ఆ వసుధార చూడండి ఎలా వెళ్తుందో.. నలుగురు చూస్తే ఏమనుకుంటున్నారని ఫణింద్రతో అంటుంది. దాంతో దేవయానిని కోప్పడతాడు ఫణీంద్ర. దేవయాని నువ్వు రిషిని పెంచిన తల్లివి మరీ కంట్రోల్ లో ఉంచాలని చూస్తే మొదటికే మోసం వస్తుంది.. అన్ని మారుతున్నాయి.. నీ ఆలోచనలు తప్ప.. ముందు ఆ పాత చింతకాయ పచ్చడి సీరియల్ మానెయ్ అంటూ క్లాస్ తీసుకుంటాడు ఫణింద్ర. ఇక రిషి, వసుధార కాలేజీకి వస్తారు. ఇక్కడికి తీసుకొచ్చారేంటి సర్ అని వసుధార అడుగుతుంది. సర్ ప్రైజ్ అంటూ తన కేబిన్ కి తీసుకొని వెళ్తాడు. కళ్ళు మూసుకో వసుధార అని చెప్పి.. రిషి తన చేతులతో వసుధార కళ్ళని మూసి తీసుకొని వెళ్తాడు. అక్కడ ఒక కర్టెన్ ఓపెన్ చేస్తాడు.. ఆ కర్టెన్ వెనకాల.. DBST మెడికల్ కాలేజీ అని రాసి ఉంటుంది. అది చూసి వసుధార షాక్ అవుతుంది. ఎలా ఉంది నా సర్ ప్రైజ్.. రిషేంద్ర భూషణ్ అంటే ఏమనుకున్నావ్.. దేనికి కాంప్రమైజ్ కాడని హ్యాపీగా ఫీల్ అవుతాడు రిషి. మీకో విషయం చెప్పాలని.. సౌజన్య రావు ప్రపోజల్ గురించి చెప్పగానే రిషి షాక్ అవుతాడు. నో వే అని రిషి అంటాడు. నువ్వెందుకు డల్ గా ఉన్నావ్.. అతను మనకు సాయం చేసిన చెయ్యకపోయిన మెడికల్ కాలేజీ స్టార్ట్ చేస్తానని రిషి అంటాడు. ఇక ఇద్దరు  కలసి ఇంటికి వెళ్తారు.

ఆ తర్వాత ఇంటికి వచ్చాక వసుధార, జగతి మాట్లాడుకుంటారు. రిషికి సౌజన్యరావు ప్రపోజల్ గురించి చెప్పానని వసుధార చెప్పగా.. రిషి ఏమైనా బాధ పడ్డాడా అని జగతి అడుగుతుంది. లేదు మేడం నాకే ధైర్యం చెప్పారని వసుధార సమాధానమిస్తుంది. రిషి కలని మనం నిజం చెయ్యాలి.. రిషి ఆనందంగా ఉంటే ముందుగా సంతోషపడేది మనమే.. దానికోసం ఏం చెయ్యడానికైనా సిధ్ధంగా ఉండాలని జగతి అంటుంది. ఆ మాటలన్నీ రిషి విని జగతి గురించి ఆలోచిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.