Read more!

English | Telugu

ఛీఛీ ఇలాంటి పంచులేసి పేమెంట్ తీసుకోవడానికి సిగ్గు లేదా.. శ్రీముఖి పరువు తీసిన హరి

సండే 11 ఏఎం ఎంటర్టైన్మెంట్ కి హెవెన్ అంటూ "ఆదివారం విత్ స్టార్ మా పరివారం" షో ప్రతీ వారం ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఇప్పుడు ఈ వారం ప్రసారం కాబోయే షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో స్టార్ మాలో కొత్తగా స్టార్ట్ అయ్యి రేటింగ్స్ లో పోటాపోటీగా దూసుకుపోతున్న మధ్యాహ్నం సమయంలో ప్రసారమవుతున్న  "మధురానగరిలో" సీరియల్  టీమ్ అలాగే రాత్రి ప్రసారమయ్యే "నాగపంచమి" సీరియల్ టీమ్ వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు. ఇక శ్రీముఖి యాకరింగ్ జోష్ మాత్రం ఎక్కడా తగ్గించకుండా ఈ వారం కూడా అదే ఎనర్జీ మెయింటైన్ చేసి నవ్వించింది. 

ఇక ఎంట్రీలోనే పుల్లైసు అమ్ముకుంటూ వచ్చారు అవినాష్, ఎక్సప్రెస్ హరి. పుల్లైసు వద్దండి..ఎందుకంటే ఐస్ పుల్లగా ఉంటే బాగోదు కదా అని కౌంటర్ వేసింది శ్రీముఖి. "ఛీఛీ ఇలాంటి పంచులు వేసి పేమెంట్ తీసుకోవడానికి సిగ్గు లేదా" అని ఎక్సప్రెస్ హరి అనేసరికి "ఇలాంటి పంచులు కూడా వేయకుండా నువ్వు పేమెంట్ తీసుకుంటున్నావ్ నీకు సిగ్గులేదా" అని శ్రీముఖి రివర్స్ కౌంటర్ వేసేసింది. తర్వాత ఫైమా, శ్రీముఖి ఇద్దరూ కలిసి సమ్మర్ కూల్ ఫ్రూట్ తాటిముంజెలని అమ్మారు స్టేజి మీద. 

ఇక మధురానగరిలో సీరియల్ హీరో శ్యామ్ ని శ్రీముఖి బాగా ఆటపట్టించింది. సీరియల్ లో అమ్మాయిలనే చూడడంట అనేసరికి "చూస్తాను కానీ అమ్మాయిల దగ్గరకు వెళ్ళను" అన్నాడు. నువ్వు రాకపోతే ఏముంది మేమే వస్తాంగా అన్నట్టు ఫైమా, శ్రీముఖి ఇద్దరూ మీద పడుతూ డాన్స్ చేసి శ్యామ్ తో కూడా డాన్స్ చేయించారు. తర్వాత నాగపంచమి సీరియల్ హీరోయిన్ కి ఒక టంగ్ ట్విస్టర్ ఇచ్చింది. "గాదెలోనే కందిపప్పు..గాదె కింద పందికొక్కు" అనేదాన్ని చెప్పించింది కానీ ఆమె సరిగా చెప్పలేకపోయింది. అదే డైలాగ్ ని మధురానగరిలో హీరో శ్యామ్ తో చెప్పించింది. కానీ అతను కూడా సరిగా చెప్పలేకపోయాడు. అన్నీ తప్పులు చెప్పేసాడు. ఈ టంగ్ ట్విస్టర్ సెగ్మెంట్  అయిపోయాక పనసకాయల సీజన్ కాబట్టి మధురానగరిలో సీరియల్ హీరో శ్యామ్ కి, నాగ పంచమి సీరియల్ హీరో మోక్షకి రెండు పెద్ద పనసకాయలు ఇచ్చి ఒలిపించే పోటీ పెట్టింది. ఇద్దరూ పోటాపోటీగా వలిచారు కానీ ప్రోమోలో మాత్రం శ్యామ్ ఫస్ట్ వొలిచినట్టు చూపించారు. కానీ ఇద్దరిలో ఎవరు స్పీడ్ గా ఒలిచారు..తొనలు ఎవరు ముందు తీశారో తెలియాలంటే ఈ ఎపిసోడ్ కోసం కొన్ని గంటలు వెయిట్ చేయాలి.