Read more!

English | Telugu

మెడికల్ కాలేజ్ ప్లాన్ ని కనిపెట్టిన ‌శైలేంద్ర.. రిషి పసిగట్టేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -754 లో.. రిషి మెడికల్ కాలేజీ గురించి అందరితో మాట్లాడుతాడు. డాక్టర్స్ మేక్స్ డాక్టర్స్ అనే కాప్షన్ తో.. మన కాలేజీ ద్వారా ఫ్రీగా నాణ్యమైన విద్యని అందించాలని, చదవాలని కోరిక ఉండి చదవలేకపోయేవారికి మన కాలేజీలో విద్యనందించాలి.. దీనికి సంబంధించి కొంతమంది డాక్టర్స్ తో నేను మాట్లాడాను. ఒక్కొక్కరు ఒక్కో స్టూడెంట్స్ కి అయ్యే ఖర్చుని భరిస్తానన్నారు అని రిషి చెప్పగానే.. మంచి ఆలోచన అంటూ ఫణింద్ర, మహేంద్రలు రిషిని పొగుడుతారు.. ఇదంతా చూస్తున్న శైలేంద్ర కుళ్ళుకుంటాడు.

ఆ తర్వాత సౌజన్య రావుకి శైలేంద్ర కాల్ చేసి మాట్లాడుతాడు. నాలా అడ్డదారిన పోయేవాడికి పనికిమాలిన సలహాలు ఇవ్వడానికి నీలాంటి మంత్రి కావాలని సౌజన్య రావుని శైలేంద్ర అంటాడు. థాంక్స్ సర్ నన్ను అలా అయినా గుర్తించినందుకని సౌజన్యరావు అంటాడు. ఆ తర్వాత ఇదేంటి రిషికి ఇంత ఫాలోయింగ్ ఉంది.. ప్రతి స్టూడెంట్స్ రిషిని సొంత బ్రదర్ లాగా ట్రీట్ చేస్తున్నారు.. నాకు నచ్చడం లేదు.. ఎలాగైనా ఆ స్థానం నాకు కావాలని శైలేంద్ర అనుకుంటాడు. అప్పుడే జగతి వచ్చి.. ఏంటి ఇక్కడ కుర్చున్నావని అడుగుతుంది. ఇక్కడ కూర్చోవడానికి కూడా మీ ఎం.డి గారి పర్మిషన్ తీసుకోవాలా అ‌ని అంటాడు. అలా ఏం కాదని జగతి అంటుంది. రిషి ఈ స్థాయికి రావడానికి మీరు వసుధారనే అని జగతితో అంటాడు శైలేంద్ర. రిషి తనంతట తాను ఎదిగిన మనిషి అని, తనే మాకు శక్తి అని.. రిషి గురించి శైలేంద్రకి జగతి గొప్పగా చెప్పేసరికి తను ఇంకా కోపంతో రగిలిపోతుంటాడు. అప్పుడే రిషి వచ్చి.. మేడం మీరు ఇక్కడే ఉన్నారా అని అంటాడు. కాంట్రాక్టర్ గురించి మాట్లాడాలని రిషి అంటాడు. నాకు తెలిసిన కాంట్రాక్టర్ ఉన్నాడని శైలేంద్ర అంటాడు. సరే అన్నయ్య తానకే ఇద్దామని రిషి అనగానే.. ఎందుకు రిషి.. మన పాత కాంట్రాక్టర్ ఉన్నాడు కదా అని అంటుంది. అన్నయ్య కి తెలిసిన వాళ్ళయితే నమ్మకంగా ఉంటారు కదా అని రిషి అంటాడు. సరేనని జగతి అంటుంది.

ఆ తర్వాత రాత్రి  రిషి, వసుధారలు కాలేజీ గురించి డిస్కస్ చేసుకుంటుంటారు. అప్పుడే శైలేంద్ర వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. మన కాలేజీ అందరి కంటే ముందు స్థాయిలో ఉండాలి.. దానికి మనం కష్టపడాలని, కాలేజీ గురించి రిషి ప్లాన్ చెప్తుంటాడు రిషి. అన్ని పనులు వసుధారకేనా, తను ఒక్కతే ఎలా చూసుకుంటుంది.. నాకు కొన్ని అప్పగించమని రిషి అంటాడు. వసుధార గురించి మీకు తెలియదు.. ఏ పనయినా అలసిపోకుండా చేస్తుందని వసుధార గురించి చెప్తాడు. అప్పుడే జగతి ఫైల్ తీసుకొచ్చి రిషికి ఇస్తుంది. ఇప్పుడే ఇవ్వన్నీ ముందే ఎందుకు అనుకుంటున్నావు రిషి.. ప్లాన్ లు ఇప్పుడే రివీల్ చేయడం ఎందుకని జగతి అంటుంది. జగతి అలా అనడంతో.. శైలేంద్ర ఆలోచిస్తు ఈవిడేంటి ఇలా మాట్లాడుతుంది.. ముందుగా ఈవిడ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలని అనుకుంటాడు. పిన్నిని మేడం అని కాకుండా అమ్మ అని పిలవచ్చు కదా రిషి.. పిన్నికి నువ్వంటే చాలా ఇష్టమని అంటాడు. ఆ తర్వాత జగతి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సారీ రిషి.. నిన్ను ఇబ్బంది పెట్టినందుకని శైలేంద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.