Read more!

English | Telugu

వాళ్ళిద్దరిని దగ్గర చేయాలనే ప్రయత్నంలో ‌రేవతి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -181 లో... ముకుంద తన ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడుతుంది. మురారి నన్ను ఇరిటేట్ లా ఫీల్ అవుతున్నాడని ముకుంద తన బాధనంతా ఫ్రెండ్ తో చెప్పుకుంటుంది. అదేం లేదు ఇంట్లో వాళ్ళ గురించి అలా ఉంటున్నాడడెమో అని తన ఫ్రెండ్ అంటుంది. ఆ తర్వాత ముకుంద ఫోన్ కట్ చేసి.. మురారి తన ప్రేమని ఆధార్శ్ కోసం త్యాగం చేసాడు. నా ప్రేమ కోసం కృష్ణని అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకున్నాడు. మురారిని తప్పుగా అర్థం చేసుకుంటూన్నానా అని ముకుంద అనుకుంటుంది. 

మరొకవైపు కృష్ణ, మురారిల కాపురం ఎలా బాగు చెయ్యాలని రేవతి ఆలోచిస్తుంటుంది. ఇద్దరు అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకొని మా ముందు ప్రేమగా ఉన్నట్లు నటిస్తున్నారు. వాళ్ళ అగ్రిమెంట్ మ్యారేజ్ ని పర్మినెంట్ చెయ్యాలి. అందుకు ముందు వాళ్ళిద్దరిని దగ్గర చేయాలి. ఒకరంటే ఒకరు విడిచి ఉండలేననేంతగా ఒకటి చేయాలని రేవతి అనుకుంటుంది. ఆ తర్వాత ముకుంద పై నుండి కిందకి వస్తుంది. ఏంటి ఎవరు లేరా? ఇల్లంతా సైలెంట్ గా ఉందని అనుకుంటుంది. అప్పుడే రేవతి వచ్చి ఏం ఆలోచిస్తున్నావని ముకుందని అడుగుతుంది. అంతలోనే కృష్ణ, మురారిలు పై నుండి నవ్వుతు కిందకి వస్తుంటే.. ఏంటి నిజమైన భార్యాభర్తలలాగా నవ్వుతు వస్తున్నారని ముకుంద అనుకుంటుంది.

ప్రేమగా ఉన్నట్లు ఏం నటిస్తునారని రేవతి తన మనసులో అనుకుంటుంది. ఏంటి అత్తయ్య ఎక్కడికో బయటకు వెళ్లారని కృష్ణ అడుగుతుంది. నీకేలా తెలుసని రేవతి అడుగుతుంది. కృష్ణకి ఫేస్ రీడింగ్ తెలుసని మురారి అంటాడు. అవునా అయితే నేను ఏం ఆలోచిస్తున్నా చెప్పు అని ముకుంద అనగానే.. ఏంటి ఎవరినో ప్రేమిస్తున్నవని ముకుందని అడుగుతుందేమో  అని రేవతి, మురారి ఇద్దరు టెన్షన్ పడుతారు. నువ్వు మీ అమ్మ ఆరోగ్యం గురించి కాకుండా ఇంకెవరి గురించో ఆలోచిస్తున్నావని కృష్ణ అంటుంది. అవును కృష్ణ నువ్వు కరెక్ట్ చెప్పావ్ ఆదర్శ్ గురించి ఆలోచిస్తున్నాని ముకుంద చెప్తుంది.. ఆ తర్వాత రేవతి మెట్టెలు తీసుకొని వచ్చి.. కృష్ణ కాలికి మురారిని పెట్టమంటుంది. కృష్ణ, మురారి హ్యాపీగా ఫీల్ అయిన ముకుంద మాత్రం కోపంగా చూస్తుంది. కృష్ణకి కాలిమెట్టెలు పెడతాడు మురారి. ఆ తర్వాత కృష్ణ, మురారి ఇద్దరు కలిసి బయటకు వెళ్తారు.

మరొకవైపు ముకుంద ఆలోచిస్తుంటే.. థాంక్యూ ముకుంద, నీ వల్లే మురారి కాపురం బాగుంటుంది. ఎందుకంటే నువ్వే వాళ్ళది అగ్రిమెంట్ మ్యారేజ్ అని చెప్పావ్.. నువ్వు చెప్పడం వాల్లే నాకు తెలిసింది. అందుకే వాళ్ళ కాపురం బాగుండడం కోసం ప్రయత్నం చేస్తున్నానని ముకుందతో రేవతి అంటుంది. మరొకవైపు కృష్ణ, మురారి వెళ్తుంటే.. మెట్టెలు నొప్పిగా ఉన్నాయి. సెట్ చేయమని మురారిని అనగానే మురారి సెట్ చేస్తాడు. అలా మురారి మనసులో ఏం ఉందో తెలుసుకోవాలని కృష్ణ అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.