Read more!

English | Telugu

ఎంగేజ్మెంట్ ని బ్రేకప్ చేసుకున్న రసజ్ఞ...

రసజ్ఞ రీతూ గుప్పెడంత మనసు సీరియల్ లో రిషిని ఏడిపించే రోల్ లో నటించింది. తర్వాత ఇంకొన్ని సీరియల్స్  లో కూడా నటించింది. ఐతే ఆమె కొన్ని నెలల కిందట సీరియల్స్ నుంచి  తప్పుకుంటున్నట్లు చెప్తూ ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అలాగే తన ఎంగేజ్మెంట్ వీడియోని తన ఫియాన్సీకి సర్ప్రైజ్ లు ఇస్తూ చేసిన వీడియోస్ అన్నిటినీ ఇప్పుడు సోషల్ మీడియా నుంచి డిలీట్ చేసింది.

అంటే  రసజ్ఞ బ్రేకప్ చేసుకుంది అన్న న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక ఇన్డైరెక్ట్ మెసేజ్ కూడా పోస్ట్ చేసింది. " ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఓకే కానీ నమ్మకద్రోహం చేయకూడదు... విబేధాలు ఓకే కానీ..రెస్పెక్ట్ ఇవ్వకపోవడం కరెక్ట్ కాదు" అంటూ ఒక మెసేజ్ ని పోస్ట్ చేసింది.  అలాగే సోషల్ మీడియాలో ఎంగేజ్మెంట్ వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేసేసరికి నెటిజన్స్ అంతా ఆమెను ఇదే విషయం గురించి అడుగుతున్నారు "అక్కా మీ పెళ్లి ఆగిపోయి మంచి పని అయ్యింది. అసలు అతను బాలేడు . చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టేవాడిలా కనిపిస్తున్నాడు..అతని వల్లే కదా మీకు ఇష్టమైన సీరియల్స్ ని వదులుకున్నారు..మళ్ళీ సీరియల్స్ చేయండి." అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ తట్టుకోలేకే కొంచెం రెఫ్రెషింగ్ గా ఉండాలంటూ ఫామిలీతో కలిసి రీసెంట్ అన్ని టెంపుల్స్ కి వెళ్లి వచ్చింది రసజ్ఞ. కొన్ని నెలల నుంచి ఇంట్లో బాలేదు...గందరగోళంగా ఉంది అంటూ ఆ వీడియోలో చెప్పింది రసజ్ఞ.. కానీ తన ఎంగేజ్మెంట్ బ్రేకప్ అయ్యిందన్న విషయాన్ని డైరెక్ట్ గా చెప్పలేదు...మరి ఇక సీరియల్స్ లోకి మళ్ళీ ఎంట్రీ ఇస్తుందో లేదో చూడాలి.