Read more!

English | Telugu

వర్షని రెండు రోజులు ఉంచుకుని పంపిస్తానన్న కృష్ణ భగవాన్

 

ఎక్స్ట్రా జబర్దస్త్ ఈ వారం షో ఫుల్ జోష్ తో సాగింది. ఇందులో ఇమ్మానుయేల్ స్కిట్ మాత్రం బాగా నవ్వు తెప్పించింది. జబర్దస్త్ షోలో ఇమ్ము- వర్ష జంటకు స్పెషల్ ప్లేస్ ఉందన్న విషయం తెలిసిందే. వీళ్ళు విక్రమార్కుడు మూవీలో ఒక సీన్ ఉంటుంది. దాన్ని స్పూఫ్ గా చేశారు. ఇందులో విలన్ వచ్చి కానిస్టేబుల్ రాజీవ్ కనకాల భార్యను ఎత్తుకెళ్లిపోతాడు. రాజీవ్ కనకాల వెళ్లి పిల్లలు అమ్మ కోసం అడుగుతున్నారా పంపించామని అడిగినప్పుడు ఇంకో రెండు రోజులు ఉంచుకుని పంపిస్తాను అని విలన్ అంటాడు. దీన్ని ఇమ్ము తన స్కిట్ లో చేసి చూపించాడు.


ఈ సీన్ ని బేస్ చేసుకుని ఇమ్ము స్కిట్ రాసుకున్నాడు. ఇందులో ఈము ఫ్రెండ్ కి లవర్ గా చేసింది వర్ష. ఒక ఫ్రెండ్ కి పని వచ్చిందని తన లవర్ వర్షని మరో ఫ్రెండ్ దగ్గర ఉంచుతాడు...అతనికి పని రావడంతో మరో ఫ్రెండ్ దగ్గర..ఆ ఫ్రెండ్ మరో ఫ్రెండ్ దగ్గర ఉంచారు. చివరికి ఇమ్ము దగ్గరకు చేరుతుంది వర్ష. ఇమ్ముకు పని తగిలేసరికి కృష్ణ భగవాన్ ఇంట్లో దాచిపెడతాడు. కృష్ణ భగవాన్ నిప్పు..వాళ్ళ ఇంట్లో ఇంట్లో ఉంటే చాలా సేఫ్...అని చెప్పి కృష్ణ భగవాన్ దగ్గరకు వెళ్లి  " రెండు రోజులు నా లవర్ ని మీ ఇంట్లో ఉంచండి " అనేసరికి "మా ఇల్లు కూడా ఖాళీగానే ఉంది" అని పంచ్ వేసాడు భగవాన్. రెండు రోజుల తర్వాత వచ్చిన ఇమ్ము .. సర్ మా లవర్ని పంపించండి అని అడగగానే మరో రెండు రోజుల తర్వాత పంపిస్తా అని చెప్పేసరికి షాక్ అయ్యాడు ఇమ్మూ. "వర్షని వేరే ఫ్రెండ్ దగ్గర ఉంచి నేను పని మీద బయటకు వెళ్ళా...తిరిగెళ్లి వర్షని రమ్మని  అడిగితే రెండు రోజుల తర్వాత వస్తానని చెప్పింది" అని కృష్ణ భగవాన్ చెప్పేసరికి ఇమ్ము నోరెళ్లబెట్టాడు.