Read more!

English | Telugu

అదుపుతప్పిన రాజ్ ని కాపాడిన కావ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'బ్రహ్మముడి' సీరియల్ రోజుకో మలుపుతో బుల్లితెర అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఎపిసోడ్‌- 13లోకి అడుగుపెట్టింది. కాగా మంగళవారం నాటి ఎపిసోడ్‌లో.. తన చెవికమ్మ కోసం రాజ్ ఇంటికి వెళ్తుంది స్వప్న. అక్కడ రాజ్ వాళ్ళింట్లో అందరూ కలిసి స్వప్నని ఇంటర్వ్యూ మాదిరి ప్రశ్నలు అడుగుతుంటారు. వాళ్ళు అడిగిన ప్రతీదానికి సమాధానం చెప్తుంది. కావ్య వాళ్ళింట్లో చెప్పిన ప్రతీది తన మాటలాగా ఇక్కడ రాజ్ కుటుంబసభ్యులతో చెప్తుంది. అక్కడ కావ్య మాటలన్నీ స్వప్న నోటివెంట విన్న వాళ్ళంతా చప్పట్లు కొడతారు. రాజ్ వాళ్ళ అత్త రుద్రాణి సైతం.. "ఇన్ని తెలివితేటలు ఉన్న ఈ పిల్ల.. మా ఇంటికి కోడలిగా వస్తే ఇక అంతే సంగతులు.. ఎలాగైనా తనని ఈ ఇంటి కోడలు కాకుండా చూడాలి" అని అనుకుంటుంది.

స్వప్నని అడిగే ప్రతీ ప్రశ్నకి కావ్య చెప్పిన సమాధానాలే చెప్తూ ఉంటే.. అక్కడ అందరూ కావ్య వ్యక్తిత్వాన్ని ఇష్టపడుతున్నట్టుగా ఉంటుంది. మొత్తానికి స్వప్న బాగా నటించి రాజ్ కుంటుంబానికి దగ్గర అవుతుంది. అయితే రాజ్ తన ఫోన్ నెంబర్ స్వప్నకి చెప్పాలనుకుంటాడు. అంతలోపే రాజ్ వాళ్ళ బాబాయ్ వచ్చి.. "రాజ్ నువ్వు గుడికి వెళ్ళాలి" అని కంగారుపెడతాడు. దీంతో స్వప్నకి ఫోన్ నెంబర్ చెప్పకుండానే రాజ్ గుడికి వెళ్ళాల్సి వస్తుంది. అయితే రాహుల్ ఇదే అవకాశమని స్వప్నని ఇంప్రెస్ చేయాలని అన్నీ తనకి అనుకూలంగా మాట్లాడుతాడు. 

మరోవైపు గుడికి వెళ్ళిన రాజ్..  గుడి లోపల ప్రదక్షిణలు చేస్తుంటాడు. అప్పటికే గుడిలోకి వచ్చి అర్చన చేపించి ప్రదక్షిణలు చేస్తుంటుంది కావ్య. రాజ్ వెనకాల కావ్య.. ఒకరికి తెలియకుండా ఒకరు ఇద్దరూ ప్రదక్షిణలు చేస్తుంటారు. ఇంతలో గుడిలో ఆడుకుంటున్న పిల్లలు రాజ్, కావ్యలకి డాష్ ఇచ్చి వెళ్ళిపోతారు. అలా ఒక్కసారిగా పిల్లలు ఇద్దరినీ తాకేసరికి.. ఇద్దరూ పడిపోతుంటారు. అలా పడిపోతున్నప్పుడు కావ్య వెంటనే అదుపులోకొచ్చి ఆగుతుంది. ఆ తర్వాత తనముందే హోమంలో పడిపోతున్న రాజ్ ని ఒక చేతితో పట్టుకొని కాపాడుతుంది. కానీ రాజ్ తనని సేవ్ చేసిందని కూడా చూడకుండా కావ్యని తిడుతుంటాడు. అసలు ఏం అయ్యిందో కూడా తెలుసుకోకుండా కావ్యని మాటలు అంటాడు. ఇద్దరూ అలా‌ కాసేపు  ఒకరినొకరు మాటా మాటా అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.