Read more!

English | Telugu

రేవతి పంతంతో ఏడ్చేసిన‌ కృష్ణ!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్  భిన్నమైన కథతో మొదలై.. అత్యంత వీక్షకాదరణ పొందుతూ ఎపిసోడ్ -74 లోకి అడుగు పెట్టింది. కాగా మంగళవారం నాటి ఎపిసోడ్ లో..మురారి గురించి ఆలోచిస్తూ ముకుంద పరధ్యానంలో ఉండగా, అంతలోనే అలేఖ్య వచ్చి.. ఏంటి ముకుంద అలా ఉన్నావ్.. నీకు ఆదర్శ్ రావడం ఇష్టం లేదా.. కనీసం నీ గురించి పూజ చేసిన కృష్ణ, మురారి లకు థాంక్స్ కూడా చెప్పలేదని అంటుంది. ముకుంద ఒక్కసారిగా షాక్ అవుతుంది. "ఏం మాట్లాడుతున్నావ్. మరి పూజలో కృష్ణ, మురారికి బదులు మీరు ఇద్దరు కూర్చొని పూజ చెయ్యొచ్చు కదా.. అలా చేయలేదు ఏంటి? అంటే ఆదర్శ్ రావడం మీకు ఇష్టం లేదా" అంటూ ముకుంద కౌంటర్ వేస్తుంది. అటు ఇటు పోయి నా మీద పడిందేంటని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలేఖ్య.

మరోవైపు కృష్ణ తను రాసిన ఎగ్జామ్ రిజల్ట్స్ ఎలా వస్తాయోనని టెన్షన్ పడుతుంది. మురారిని టెన్షన్ పెడుతుంది. అలా కృష్ణ టెన్షన్ పడడం చూసిన మురారి.. "కింద అమ్మ పూజ చేస్తుంది.. అక్కడికి వెళ్లి దేవుడికి మొక్కుకో" అని కృష్ణ తో చెప్తాడు. సరే అని కిందకి వెళ్తుంది. అక్కడ రేవతితో "నాకు ముందు హారతి ఇవ్వండి" అనగా భవాని చూసి.. "హేయ్ తింగరి పిల్ల.. ఏంటా హడావిడి" అని కోప్పడుతుంది. ఈ రోజు నా రిజల్ట్స్ అందుకే ముందు హారతి నాకు ఇవ్వమంటున్నానని కృష్ణ అనగానే.. రేవతి వచ్చి హారతి ఇస్తుంది.

ఇంతలోనే మురారి వచ్చి నిన్నటి నుండి టెన్షన్ పడుతుంది పెద్దమ్మ అంటాడు. ACP సర్ నా రిజల్ట్స్ చూడండి అని అనగానే సరే అని ల్యాప్ ట్యాప్ తీసుకొచ్చి రిజల్ట్స్ చూస్తాడు. కృష్ణ డిస్టిక్ ఫస్ట్ లో పాస్ అవుతుంది. ఆ విషయాన్ని చెప్పకుండా సరదాగా కృష్ణని ఆటపట్టిస్తాడు మురారి. "కృష్ణ నువ్వు ఫెయిల్ అయ్యావ్" అని మురారి చెప్పగా... "నేను ఫెయిల్ అయ్యానా" అని అనుకుంటూ ఎమోషనల్ అవుతుంది. అంతలోనే డిస్టిక్ ఫస్ట్ లో పాస్ అయ్యావ్ కంగ్రాట్స్ అని ఒక్కసారిగా అరుస్తాడు మురారి. దాంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కృష్ణ. ముకుంద కంగ్రాట్స్ చెప్పి.. "ఇంకా వేరే స్టేట్స్ వెళ్లి చదువుకోవాలి" అని అనడంతో.. రేవతి ఒక్కసారిగా వీళ్ళేదు.. ఎక్కడికి వెళ్లనవసరం లేదు. ఈ ఇంటి కోడళ్ళు ఉద్యోగం చెయ్యవలసిన అవసరం లేదు"  అని గట్టిగా చెప్తుంది రేవతి. దాంతో బాధపడుతూ కృష్ణ తన గదిలోకి వెళ్తుంది. అలా వెళ్ళిన కృష్ణ ఏడ్చుకుంటూ ఇంట్లో నుండి వెళ్లిపోవడానికి బ్యాగ్ సర్దుతుంటే.. మురారి వచ్చి ఇదేంటని అడగడంతో.. ఇంట్లో నుండి వెళ్లిపోతున్నానని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.