Read more!

English | Telugu

రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ రాహుల్, స్వప్న!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -91 లో... కావ్యకి పదహారు రోజుల పండుగని గుడిలో కనకం జరిపిస్తుంది. దానికి దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాజరవుతారు. అపర్ణ మాత్రం ఇష్టం లేకుండా ప్రవర్తిస్తుంది. మరొకవైపు కనకం వాళ్ళ ఇంటిలో ఒంటరిగా ఉన్న స్వప్న ఎక్కడికో బయల్దేరుతుందని తెలుసుకున్న అప్పు.. ఈ విషయాన్ని కళ్యాణ్ కి ఫోన్ చేసి చెప్తుంది. అక్కడ రాహుల్ ఉన్నాడా అని అప్పు అడుగుతుంది. ఇప్పుడే రాహుల్ ఎక్కడికో వెళ్తున్నాడని ఫోన్ లో అవతలివైపు నుండి కళ్యాణ్ చెప్తాడు. స్వప్నని కలవడానికని అప్పు అంటుంది. వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందాం.. ఇదే మంచి ఛాన్స్ అని అప్పు అంటుంది. సరే నేను రాహుల్ ని ఫాలో చేస్తానని కళ్యాణ్ అంటాడు.

మరొకవైపు స్వప్న ఆటోలో వెళ్తుంటే.. అప్పు తనని ఫాలో అవుతుంది. మా పెళ్లి పనుల్లో రాహుల్ ఉండి ఉంటాడు. నేను కూడా వర్క్ షేర్ చేసుకోవాలని స్వప్న అనుకుంటుంది. మరొకవైపు రాహుల్ వస్తూ స్వప్న గురించి ఆలోచిస్తుంటాడు. తన అందంకి తనని వదిలిపెట్టాలని లేదు.. ఎలాగైనా స్వప్నకి ఏదో ఒకటి చెప్పాలని రాహుల్ అనుకుంటాడు. చెరొకవైపు అపర్ణ, కనకం ఇద్దరూ కలిసి కావ్యకి నల్లపూసలు కుచ్చుతుంటారు. ఇక అక్కడే ఉన్న మీనాక్షి.. తన తింగరి ప్రశ్నలతో అందరికి చిరాకు తెప్పిస్తుంది. స్వప్న, రాహుల్ లు ఒక దగ్గర కలుసుకుంటారు. రాహుల్ తన దగ్గరికి రాగానే స్వప్న వెళ్లి హగ్ చేసుకుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన అప్పు, కళ్యాణ్ లు వాళ్ళిద్దరు హగ్ చేసుకోవడం చూస్తారు. స్వప్న అలా హగ్ చేసుకోవడం చూసిన అప్పు కోపంతో స్వప్న ని తిడుతుంది. ఈ విషయం అక్కకి చెప్పాలని కనకం ఫోన్ కి కాల్ చేసి కావ్యకి ఇవ్వమంటుంది. మనం ఇన్ని రోజులుగా ఎదురుచూస్తున్న సమయం వచ్చిందక్కా.. దాని లవర్ ని స్పప్నక్క కలుసుకుంది. నువ్వు బావని తీసుకొని వస్తే వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చని అప్పు అనగానే సరేనని కావ్య అంటుంది.

మరొకవైపు స్వప్నని తీసుకొని రాహుల్ లోపలికి వెళ్తాడు. మనం పెళ్లి చేసుకొని ఫారెన్ లో ఉన్నప్పుడు.. ఇలా అందరి ముందు హగ్ చేసుకుంటే నడుస్తుంది.. కానీ ఇప్పుడు ఇలా చేస్తే బాగోదని లోపలికి తీసుకెళ్తాడు. ఏంటీ ఏం మాట్లాడట్లేదని స్వప్న అనగానే.. నువ్వు అలా మాట్లాడుతుంటే నిన్ను అలానే చూడాలనిపిస్తోందని రాహుల్ బిస్కెట్ వేస్తాడు. మరొకవైపు పూజ నుండి కావ్య బయటకి వస్తుంది. రాజ్, కావ్యలు వచ్చి రాహుల్, స్వప్నలని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటారో లేదో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.