Read more!

English | Telugu

మురారి బర్త్ డే రోజున కేక్ కట్ చేపిస్తానని చెప్పిన ఆ ఇద్దరు! 

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్‌-152 లో.. ముకుంద తన గదిలో‌ రెడీ అవుతుంది. అప్పుడే తన గదిలోని అద్దంలో ముకుంద ప్రతిబింబం కనిపిస్తుంది. నువ్వు మారిపోయావ్.. భ్రమలో ఉన్నావని ఆ ప్రతిబింబం అడుగగా.. రోజురోజుకి కృష్ణకి మురారి దగ్గర అవుతున్నాడు అదే నా భయమని ముకుంద అంటుంది. నువ్వు మనుషులని నమ్మకు, ప్రేమని నమ్ము అది మారిపోదు..‌ మనసుతో ప్రేమించమని ఆ ప్రతిబింబం ముకుందతో చెప్తుంది. ఆ తర్వాత ముకుంద నిజంలోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత ముకుంద గతంలో మురారితో కేక్ కట్ చేపించిన జ్ఞాపకాలని గుర్తుచేసుకుంటుంది. 

మరొకవైపు హాల్ లో రేవతి ఒంటరిగా కూర్చొని ధీర్ఘంగా ఆలోచిస్తుండగా.. అప్పుడే కృష్ణ వచ్చి.. అత్తయ్య అంత దిగులుగా ఉన్నారేంటని అడుగుతుంది. నా దురదృష్టాన్ని తల్చుకొని బాధపడుతున్నాను.. ఇంట్లోనే ఉన్నా తల్లికొడుకులు అపరిచితుల్లా ఉన్నాం.. అయినా నేను మాట్లాడాలన్నది వేరే విషయమని రేవతి అంటుంది. ఏంటని కృష్ణ అడుగగా.. రేపు మురారి బర్త్ డే అని రేవతి అంటుంది. దాంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ తర్వాత మురారి తన‌ గదిలో ఉన్న కృష్ణ వాళ్ళ నాన్న ఫోటో చూస్తూ మాట్లాడుతుంటాడు. రేపు నా బర్త్ డే.. ఈ విషయం అందరికి తెలుసో లేదో? ఎవరైనా విషెస్ చెప్తారో లేదో? కృష్ణకి ఈ విషయం తెలియదు? చెప్తే అందరితో ఎలాగైనా మాట్లాడించాలని చూస్తుంది. అందుకే చెప్పలేదని కృష్ణ వాళ్ళ నాన్న ఫోటోతో చెప్పుకొని మురారి బయటకు వస్తుండగా‌.. అప్పుడే కృష్ణ లోపలికి వస్తుంది. అలా ఇద్దరు డాష్ ఇచ్చుకుంటారు.

ఎందుకు నాకు ఇలా డాష్ ఇచ్చారని మురారి మీద కృష్ణ సీరియస్ అవుతుంది. అయ్యో కృష్ణ నేను చూడలేదు.. ఎందుకిలా మాట్లాడుతున్నావని మురారి అడుగగా.. నా దగ్గర నిజం దాచారని అంటుంది. ఏం నిజమని మురారి అడుగగా.. నీ బర్త్ డే అనే విషయం నా దగ్గర దాచారని కృష్ణ అంటుంది. నీకు చెప్తే నువ్వు అందరికి చెప్పి సెలబ్రేట్ చేపిద్దామనుకుంటావ్.. కానీ అందరిచేత మాటలు పడాల్సి వస్తుందని నీకు చెప్పలేదని కృష్ణతో మురారి అంటాడు. ఆ సంగతి నేను చూసుకుంటానని కృష్ణ అంటుంది. మరోవైపు మురారి ఒంటరిగా ఉండగా ముకుంద వస్తుంది. అడ్వాన్స్‌ హ్యాపీ బర్త్ డే అని విషెస్ చెప్పి, ఈ రోజు అర్థారాత్రి పన్నెండు గంటలకి నీతో కేక్ కట్ చేపిస్తానని మురారితో ముకుంద అంటుంది. దాంతో మురారి షాక్ అవుతాడు. ఒకవైపు కృష్ణ, మరోవైపు ముకుంద ఇద్దరు ఒకే టైంకి ఎలా సెలబ్రేట్ చేస్తారని మురారి అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో‌ తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.