Read more!

English | Telugu

రాజ్ కావ్యల శోభనం జరిగిందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -56 లో... రాజ్ కావ్యల శోభనం చెడగొట్టాలని రాహుల్ భావించి.. రాజ్ దగ్గరికి వెళ్ళి కావ్యపై అన్నీ కల్పించి చెప్తాడు. నీ వెనకాల ఉన్న ఆస్తి కోసమే ఆ కావ్య అలా చేసింది. అసలు తప్పంతా నీదే రాజ్ ఎంత ఈజీగా మోసపోయావని రాహుల్ అనగానే.. అవును నన్ను ఫూల్ ని చేసి పెళ్లి చేసుకుంది.. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని అంటూనే పెళ్లి చేసుకుందని రాజ్ అంటాడు. మరి ఎందుకు నువ్వు ఇదంతా భరించాలి... తప్పు చేసిన వాళ్ళ మీద కదా నీ కోపాన్ని చూపాలని రాజ్ కి మందు తాగమని రాహుల్ ఇస్తాడు. ఇప్పుడు ఒకసారి జరిగిందంతా ఆలోచిస్తే అసలు స్వప్న వెళ్ళలేదు.. కావ్యనే వెళ్ళిపోయేలా చేసి పెళ్లి పీటలపై కూర్చొని ఉన్నట్టుంది.. డబ్బు కోసం ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమైనా చేస్తారని రాహుల్ అంటాడు. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఇదంతా కావాలనే ఆ కావ్య చేసింది దానికి బుద్ది చెప్తానంటూ రాజ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నీ శోభనం జరగకుండా ఇదంతా నా ప్లాన్ రాజ్ అని రాహుల్ తన మనసులో అనుకుంటాడు.

రాజ్ ఫుల్ గా తాగి కావ్య ఉన్న స్టోర్ రూమ్ కు వెళ్తుంటే కళ్యాణ్ ఆపి.. అన్నయ్య ఏం నువ్వు చేస్తున్నావ్? తాగావా? అని అడుగుతాడు. నేను ఇప్పుడు ఆ కళావతికి బుద్ది చెప్పాలి.. అయినా నా భార్య దగ్గరికి నేను వెళ్తుంటే.. ఆపే హక్కు నీకు ఎక్కడిదిరా అని చెప్పేసి.. కావ్య ఉన్న స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్తాడు. స్టోర్ రూంకి బయటవైపు గడియపెట్టి  ఉండడంతో లోపల దాక్కోని బయట గడియా పెట్టించవా అని గడియ తీసి లోపలికి వెళ్ళిపోతాడు. ఏంటి ఇక్కడికి వచ్చారు? వెళ్లిపోండని కావ్య అంటుంది. నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావ్? నీకు బుద్ది చెప్పాకే వెళ్తాను.. అయినా ఇది నా ఇల్లు.. నన్ను వెళ్ళమంటావా అని రాజ్ అంటాడు. ఏదైనా ఉంటే ఉదయం మాట్లాడదామని కావ్య చెప్పినా కూడా వినకుండా తాగిన మైకంలో కావ్యపై పడిపోతాడు. అప్పుడు కావ్య రాజ్ ని బెడ్ పై పడుకోబెట్టబోతుండగా.. కావ్య నుదిటి మీద ఉన్న కుంకుమ రాజ్ షర్ట్ కి అంటుకుంటుంది. ఎంత వద్దనుకున్నా మనం దగ్గర అవుతున్నామా.. నాకు ఎందుకో నచ్చడం లేదని కావ్య అనుకుంటుంది. నువ్వు ఎంత అందంగా ఉంటే మాత్రం.. నిన్ను అస్సలు క్షమించనని కావ్యని తల్చుకుంటూ నిద్రపోతాడు.

ఆ తర్వాత ఉదయం అందరు హాల్లో కూర్చొని ఉంటారు. కావ్య రూమ్ లో నుండి రాజ్ చెప్పులు చేతిలో పట్టుకొని వస్తుంటే.. అందరూ షాక్ అవుతారు. రాత్రి శోభనం ఇష్టం లేదు అన్నట్లు మాట్లాడి ఇప్పుడు కావ్య రూమ్ లో నుండి బయటకు వస్తున్నావని రాజ్ నానమ్మ అంటుంది. ఏంటి వీళ్ళు శోభనం జరిగిందని అనుకుంటున్నరా అని రాజ్ తన మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.