Read more!

English | Telugu

గౌతమ్ ని ఇంటికి పిలిచిన కృష్ణ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి '. ఈ సీరియల్ బుధవారం నాటి  ఎపిసోడ్-117 లో.. "నువ్వు నందు గురించి ఆలోచిస్తూ మా పెద్దమ్మతో పంతానికి పోతున్నావు" అని కృష్ణతో మురారి అంటాడు. "నేను నందు ఆరోగ్యం బాగవ్వాలని ఆలోచిస్తున్నా.. నందు విషయంలో నేనేం తప్పు చెయ్యలేదని నిరూపించుకోవడానికి రేపు గౌతమ్ సర్ ని ఇంటికి రమ్మంటున్నా" అని కృష్ణ చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత గౌతమ్ కి ఫోన్ చేసి.. రేపు మా ఇంటికి రండని చెప్పగానే.. "నేను రాలేను కృష్ణ.. నేనంటే మీ వాళ్ళకి చాలా కోపం" అని గౌతమ్ అంటాడు. నందు కోసం రండి సర్ అని కృష్ణ అంటుంది. సరే వస్తాను ఇదివరకు భయపడి నందుని దూరం చేసుకున్నాను.. ఇక భయపడను వస్తానని గౌతమ్ అంటాడు. 

ఆ తర్వాత ఉదయం రేవతి కిచెన్ లో వంట చేస్తుండగా.. కృష్ణ వెళ్ళి ఇంటికి గెస్ట్ వస్తున్నారు.. స్పెషల్ వంటలు చెయ్యండి అత్తయ్య అని చెప్తుంది. ఎవరని రేవతి అడుగగా.. మన నందుని ప్రేమించిన వ్యక్తి వస్తున్నాడు అని కృష్ణ చెప్తుంది. అలా తను చెప్పగానే రేవతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అలా చేస్తే.. నీతో పాటు నన్ను కూడా ఇంట్లో నుండి బయటకు పంపించేస్తారని రేవతి అంటుంది. మీకు నందు ప్రేమ విషయం తెలుసా? అని రేవతిని అడుగుతుంది కృష్ణ. అప్పుడు రేవతి నాకేం తెలియదు అనడంతో నందు, గౌతమ్ ల ప్రేమ విషయం చెప్పడంతో పాటుగా నందుకి గతం గుర్తు రాకుండా టాబ్లెట్స్ వాడుతున్నారని నిజాలన్నీ రేవతికి చెప్పేస్తుంది కృష్ణ. మన నందు ప్రేమించిన సిద్దు ఎవరో కాదు మా గౌతమ్ సర్.. అందుకే ఈ రోజు అతడిని ఇంటికి పిలిచానని కృష్ణ చెప్పడంతో.. రేవతి సరే అని చెప్పి వంటలు తయారు చేస్తానని చెప్తుంది. 

ఆ తర్వాత కృష్ణ తన రూమ్ లోకి వెళ్లేసరికి మురారి స్నానం చేసి వస్తాడు. కాస్త తల తుడవచ్చు కదా కృష్ణ అని అనగానే.. నా కన్నీళ్లు నేనే తుడుచుకున్నానని కృష్ణ అంటుంది. కృష్ణ కోపం తగ్గించాలని మురారి సరదాగా మాట్లాడినా తను మాత్రం కోపంగానే ఉంటుంది. కిందకి రండి.. గౌతమ్ సర్ వస్తున్నాడు టాబ్లెట్స్ గౌతమ్ సార్ ఇచ్చాడని చెప్తాడు. నేను ఏ తప్పు చెయ్యలేదని నిరూపించుకోవాలని కృష్ణ అంటుంది. ఆ విషయం మొన్న నాకు ఎందుకు చెప్పలేదని మురారి అడుగుతాడు. మీరు పురుషాహంకారంతో ఉన్నారు కదా.. అందుకే చెప్పలేదని కృష్ణ చెప్పేసి వెళ్ళిపోతుంది.

అందరూ హాల్లో ఉంటారు. మధు, అలేఖ్యలు ఇంట్లోకి వచ్చి భవాని ఆశీర్వాదం తీసుకుంటారు. వంటగదిలో నుండి గుమగుమలు వస్తున్నాయి.. మేము వస్తున్నామని చేసారా? అని మధు అంటాడు. లేదు కృష్ణ గెస్ట్ ని ఇన్వైట్ చేసింది అని రేవతి అనగానే.. పక్కబే ఉన్న భవాని.. గెస్ట్ ఎవరని అడుగుతుంది. మా గౌతమ్ సర్ వస్తున్నారని కృష్ణ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.