Read more!

English | Telugu

మా నాన్న సొంత ఇంటి కలను నేను నెరవేర్చాను...ప్రియాంక సింగ్

జబర్దస్త్ ఎంతో మంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది. అందులో భాగంగానే సాయి తేజ అలియాస్ ప్రియాంక సింగ్ కి కూడా లైఫ్ ఇచ్చింది. జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేస్తూ అమ్మాయిలకు అసూయ పుట్టించేలా అందంగా రెడీ అవుతూ అచ్చమైన అమ్మాయిలనే చేసేవాడు సాయి తేజ. అలా అబ్బాయిగా ఉన్న సాయి తేజ కాస్త అమ్మాయిగా మారిపోయి ప్రియాంక సింగ్ గా కొత్త జన్మ ఎత్తింది. ఇక ఇప్పుడు ప్రియాంక సింగ్ తన కన్న కలను నెరవేర్చుకుంది. బిగ్ బాస్ లో కూడా సొంత ఇంటి కల గురించి చెప్పింది. ఇప్పుడు ఆ కోరికను నెరవేర్చుకుంది. తాను కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలసలో సొంత ఇల్లు కట్టించుకుంది.

ఐతే ఇంటి గృహప్రవేశం ఎప్పుడో ఐపోయింది కానీ దానికి సంబంధించిన వీడియోని మాత్రం సోషల్ మీడియాలో లేట్ గా అప్ లోడ్ చేసింది ప్రియాంక సింగ్. అలాగే ఈ సొంత ఇంటి గృహప్రవేశ సమయంలో తన పేరెంట్స్ తో కలిసి ఒక యజ్ఞం చేసినట్లు చెప్పింది. తన లైఫ్ లో పేరెంట్స్ తో కలిసి చేసిన ఫస్ట్ పూజ అని చాలా జోష్ తో చెప్పింది. వాళ్ళ నాన్నగారు ఈ ఇల్లు కట్టించాక ఎంతో  హ్యాపీగా ఫీలయ్యారని చెప్పింది. ఇక తన ఇల్లు మొత్తాన్ని కూడా మరో హోమ్ టూర్ చేసి చూపిస్తాను అని చెప్పింది. ఇక ప్రియాంక సింగ్ చేసిన ఈ పనికి నెటిజన్స్ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. కంగ్రాట్యులేషన్స్ చెప్పారు. పేరెంట్స్ ని బాగా చూసుకుంటున్నారని పొగిడేశారు. ప్రియాంక సింగ్ తన లైఫ్ జరిగిన విషయాలకు బాధ పడకుండా ధైర్యంగా ముందడుగు వేసింది.

అలాంటి టైములో ఆమెకు బిగ్ బాస్ రూపంలో ఒక మంచి అవకాశం వచ్చింది. బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చాక అందరితో సమానంగా గేమ్ ఆడి తనను తాను ప్రూవ్ చేసుకుంది. కొంత కాలం వరకు చీరకట్టులో ఎంతో అందంగా కనిపించిన ప్రియాంక సింగ్ ఇప్పుడు హాట్ ఫోటో షూట్స్ తో ఇన్స్టాగ్రామ్ లో ఫాన్స్  తో టచ్ లో ఉంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటోంది.