Read more!

English | Telugu

స్టేడియంలో సందడి చేసిన రాహుల్ సిప్లిగంజ్, వర్షిణి!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చిందంటే తెలుగు ప్రేక్షకులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు విపరీతంగా చూసేస్తారనే విషయం అందరికి తెలిసిందే. అలాగే ఈ ఐపీఎల్ మ్యాచ్ లను సినీ సెలబ్రిటీలు సైతం స్టేడియంకి వెళ్ళి చూడటం కొత్తేమీ కాదు. ఇదే తరహాలో రాహుల్ సిప్లిగంజ్, వర్షిణిలు ఐపీఎల్ చూడటానికి వెళ్ళారు. రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ. ఆర్ఆర్ఆర్ మూవీలో అతను పాడిన నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావడంతో.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ప్రైవేట్ ఆల్బమ్స్ తో  కెరీర్ మొదలు పెట్టిన రాహుల్ సినిమా పాటలు, బిగ్ బాస్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక రాహుల్ పాడిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటు' పాటకి గాను ఆస్కార్ రావడంతో.. ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తూ.. ఇటీవల దుబాయ్ లో తన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసాడు. 

రాహుల్  బిగ్ బాస్-3 విన్నర్.. దాంతో బిగ్ బాస్ తర్వాత అతనికి మరింత క్రేజ్ పెరిగింది. బిగ్ బాస్ లో పునర్నవితో లవ్ ట్రాక్ నడిపాడు. అలా  బిగ్ బాస్ లో ఎక్కువ స్క్రీన్ స్పేస్ వచ్చింది.  ఆ షో తర్వాత రాహుల్ సొంతగా మెన్స్ క్లాత్ స్టోర్ ని ఓపెన్ చేశాడు. ఇలా బిజీ లైఫ్ గడుపుతూ, ఎప్పటికప్పుడు ఫ్రెండ్స్ తో మీటింగ్స్ అంటూ ఎంజాయ్ చేస్తూ కన్పిస్తున్నాడు రాహుల్. అయితే అప్పట్లో అషురెడ్డితో దుబాయ్ లో దిగిన ఫొటోస్ ని ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయగా అవి కాస్త వైరల్ అయిన విషయం అందరికి తెలిసిందే. కాగా తాజాగా హైదరాబాద్ లో జరిగిన సన్ రైజర్స్ మ్యాచ్ ని చూడడానికి యాంకర్ వర్షిణి తో రాహుల్ వెళ్లాడు. ఇక అక్కడ స్టేడియంలో రాహుల్, వర్షిణి ఇద్దరు కలిసి సందడి చేసారు. అదే సమయంలో స్టేడియంలో రాహుల్ పాట రావడంతో.. ఆ పాటకి తన వాయిస్ కలుపుతూ ఎంజాయ్ చేస్తున్న వీడియోని రాహుల్, వర్షిణిలు తమ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. కాగా ఇది ఇప్పుడు వైరల్ గా మారింది.