English | Telugu

ప్రియాంక జైన్ తో బ్రేకప్ చేసుకున్న శివ్....మీ అమ్మగారితో మాట్లాడాక చెప్తా నీ పని

ప్రియాంక జైన్ తో బ్రేకప్ చేసుకున్న శివ్....మీ అమ్మగారితో మాట్లాడాక చెప్తా నీ పని

కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2 కూడా మంచి హాట్ గా అలాగే మంచి ఫైట్స్ తో రచ్చ రంబోలా చేసేలాగే కనిపిస్తోంది. ఈ షోలో అదిరిపోయే డాన్సులు ఉన్నాయి..స్కిట్స్, టాస్కులు అన్నీ అలరించబోతున్నాయి. ఇక లేటెస్ట్ గా రిలీజయిన ప్రోమో చూస్తే మాత్రం ఎవ్వరైనా షాకవ్వాల్సిందే. ఎందుకంటే ప్రియాంక జైన్ కి బ్రేకప్ చెప్పాడు శివ్..ఈ కొత్త ప్రోమో ఎండింగ్ లో చూస్తే అనకూడని మాట అనేశాడు. హోస్ట్ శ్రీముఖి "పరి కదా" అనేసరికి శివ్ ఐతే మరీ ఘోరంగా "తొక్కలో పరి..."అన్నాడు దాంతో అనసూయ, హమీద, శ్రీముఖి, తేజస్విని మడివాడ, శేఖర్ మాష్టర్ అంతా ఒక్కసారిగా  నోరెళ్లబెట్టారు. మరో వైపు పరి అలియాస్ ప్రియాంక జైన్ ఆన్లైన్ లోకి వచ్చింది..ఆ మాటల్ని ఆమెతోనే చెప్పేసాడు.

"ఈ షో అయ్యేవరకు, బాయ్స్ మళ్ళీ గెలిచేవరకు నేను నీతో బ్రేకప్ చేసుకోవాలనుకుంటున్నా" అని చెప్పేసాడు. ఆ మాటకు ప్రియాంక జైన్ కూడా షాకయ్యింది. ఆన్లైన్ లో అంత మంది ఆడియన్స్ చూస్తుండగా బ్రేకప్ అన్న మాట వినేసరికి స్క్రీన్ మీద రంగులు కూడా మారిపోయాయి. "సరే నేను మీ అమ్మ గారికి ఫోన్ చేసి ఈ బ్రేకప్ విషయం గురించి మాట్లాడతాను..ఈ చెత్త మాటలు మొత్తాన్ని కూడా నువ్వే క్లియర్ చేయాలి..లేదంటే" అన్నట్టుగా సీరియస్ గా ఆన్లైన్ వీడియోని కట్ చేసేసింది. వెంటనే శ్రీముఖి "పరి పరి సారీ " అని చెప్పినా కూడా ప్రియాంక జైన్ వినిపించుకోలేదు. ప్రియాంక జైన్, శివ్ మౌనరాగం సీరియల్ నుంచి ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ గా ఉంటున్నారు. త్వరలో పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నారు. ఐతే ఏమయ్యిందో ఏమో కానీ శివ్ మాత్రం ఈ షోలో పరికి బ్రేకప్ చెప్పడంతో ఇప్పుడు అందరూ షాకయ్యే మాటలు చెప్పారు. మరి ఇది నిజమా కాదా అన్నది తెలియాలంటే షో చూడాల్సిందే.