English | Telugu

ఒక్క‌సారి పవన్‌కల్యాణ్‌తో.. ప్రియమణి కోరిక!

హీరోయిన్‌గా ప్రియమణి కెరీర్ స్టార్ట్ చేసి ప‌ద్దెనిమిదేళ్లు. ఈ ప‌ద్దెనిమిదేళ్లలో తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో నటించింది. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, జగపతిబాబు మొదలుకుని ఎన్టీఆర్, నితిన్, రవితేజ, గోపీచంద్ పక్కన సినిమాలు చేసింది. కానీ, ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయలేదు. పవన్‌తో ఒక్క సినిమా చేయాలని ఉందని తన మనసులో కోరికను ప్రియమణి బయటపెట్టింది.

ప్రజెంట్ 'ఢీ'లో ప్రియమణి జడ్జ్‌గా చేస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం పవన్ కల్యాణ్ పాటలు, డైలాగులను మెడ్లీగా తీసుకుని కంటెస్టెంట్ కార్తీక్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అది పవన్‌కు ఫెంటాస్టిక్ ట్రిబ్యూట్ అని ప్రియమణి చెప్పారు. తర్వాత పవన్ గురించి మాట్లాడారు.

"నేను ఒకే ఒక్కసారి పవన్ కల్యాణ్ సార్‌ను కలిశా. అప్పటి నుండి ఇప్పటికి నాకు ఓ కోరిక ఉంది. ఎప్పుడైనా ఆయనతో కలిసి ఒక్క సినిమాలో వర్క్ చేయాలని ఉంది. ఆయనతో పనిచేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను" అని ప్రియమణి చెప్పుకొచ్చారు. పవన్ వరుసపెట్టి సినిమాలు చేస్తున్న నేపథ్యంలో ఆమెకు అవకాశం వస్తుందని ఆశిద్దాం. పవన్ చెవిన ప్రియమణి మాటలను కొరియోగ్రాఫర్ గణేష్ వేస్తాడని ఆశిద్దాం. వెంక‌టేశ్ జోడీగా ఆమె న‌టించిన 'నార‌ప్ప' మూవీ జూలై 20న అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా రిలీజ్ అవుతోంది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.