English | Telugu

దారి త‌ప్పుతున్న ఆర్య‌వ‌ర్ధ‌న్‌!

'బొమ్మ‌రిల్లు' సినిమాలో సిద్ధార్ధ్‌కి బ్ర‌ద‌ర్‌గా న‌టించి ఆక‌ట్టుకున్న శ్రీ‌రామ్ బుల్లితెర‌పై ప్ర‌స్తుతం బిజీగా మారిపోయారు. ప్ర‌స్తుతం శ్రీ‌రామ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తూ ‌నిర్మిస్తున్న సీరియ‌ల్ 'ప్రేమ ఎంత మ‌ధురం'. ఏజ్ బార్‌ అయిన యువ‌కుడు ఆర్య‌వ‌ర్ధ‌న్‌కీ... త‌న కంటే చాలా చిన్న‌దైన అనురాధ‌కీ మ‌ధ్య సాగే ప్రేమ‌క‌థ‌గా ఈ సీరియ‌ల్‌ని డిజైన్ చేశారు. గ‌త కొన్ని వారాలుగా ఈ సీరియ‌ల్ విజ‌య‌వంతంగా జీ తెలుగులో ప్ర‌సారం అవుతోంది.

ఆర్య‌వ‌ర్థ‌న్‌ని ప్రేమిస్తున్న అనురాధ త‌న తండ్రి సుబ్బు కార‌ణంగా అత‌నికి దూరంగా వుండ‌టానికి అంగీక‌రిస్తుంది. ఆర్య వ‌ర్ధ‌న్ ఆఫీసు నుంచి బ‌య‌టికి వ‌చ్చిన అనురాధ కొత్త ఉద్యోగం వెతుక్కుంటుంది. ఈ క్ర‌మంలో అనురాధ‌ని ఆర్య‌వ‌ర్ధ‌న్ నుంచి దూరం చేసిన మీరా కావాల‌నే ఆఫీసుకి రాకుండా ఆర్య‌వ‌ర్ధ‌న్‌నే త‌న ఇంటికి వ‌చ్చేలా చేస్తుంది. మీరా కోసం వ‌చ్చిన ఆర్య‌వ‌ర్ధ‌న్ ఆమె ఇంట్లో ఏం చూశాడు?

అనురాధ‌ను ప్రేమించే ఆర్య వ‌ర్థ‌న్ అనూహ్యంగా మారిపోయి మీరాకు అండ‌గా వుంటాన‌ని ఎందుకు మాటిచ్చాడు? తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఆర్య వ‌ర్ధ‌న్ దారి తప్పుతున్నాడా? అన్న‌ది నేడు ఆస‌క్తిక‌రంగా మార‌బోతోంది. బుల్లెతెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న 'ప్రేమ ఎంత మ‌ధురం' సీరియ‌ల్ జీ తెలుగులో ఫ‌స్ట్ ప్లేస్‌లో నిలుస్తోంది.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.