English | Telugu

పెద్దోడు ఓడిపోయాడు.. చిన్నోడు గెలిచాడు... శివాజీ హ్యాపీ!

గత వారం ఎవిక్షన్ పాస్ కోసం జరిగిన గేమ్స్‌లో విజయం సాధించి ఎవిక్షన్ పాస్ ని తన సొంతం చేసుకున్నాడు యావర్. అయితే శనివారం రోజు వచ్చిన నాగార్జున యావర్‌కు కంగ్రాట్స్ చెబుతూనే... నువ్వు ఆడిన గేమ్స్‌ని ఒక్కసారి చూద్దామా అంటూ యావర్ ఆడిన గేమ్స్‌ని చూపించాడు. ఆ వీడియోలో బిగ్ బాస్ చెప్పిన గేమ్ రూల్స్‌ను యావర్ పాటించకుండానే గేమ్ విన్నర్‌గా నిలిచాడనే విషయం తెలిసిపోయింది. యావర్ తను చేసిన ఫౌల్ గేమ్‌ని చూసి తనకొచ్చిన ఎవిక్షన్ పాస్ ని  నిజాయితీగా  తిరిగి బిగ్ బాస్‌కి అప్పగించాడు. ఈ రోజు ఎవిక్షన్ పాస్ కోసం జరిగిన రేస్ లో పల్లవి ప్రశాంత్ గెలిచాడు. కాగా శివాజీ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు.

బిగ్ బాస్ సీజన్-7 లో పన్నెండవ వారం ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం ఒకే ఒక్క టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్‌. ఇందులో ఎవరైతే గెలుస్తారో వారిదే ఎవిక్షన్ పాస్ అని బిగ్ బాస్ చెప్పడంతో కంటెస్టెంట్స్ తమ సత్తా నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు.

నిన్నంతా నామినేషన్ ల హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. పల్లవి ప్రశాంత్ ని గౌతమ్ టార్గెట్ చేసి మాటలు జాగ్రత్తగా రానీయి అనడం.. నేనేంటో చూపిస్తానని చెప్పడం. అమర్ దీప్, రతికల మధ్య మాటల యుద్ధం అంతా హైలైట్ అవ్వగా.. నేడు విడుదల చేసిన మొదటి ప్రోమోలో ప్రియంక వర్సెస్ శివాజీ హీటెడ్ ఆర్గుమెంట్ సాగినట్టుగా తెలిసింది. ఇక తాజాగా రిలీజ్ చేసిన రెండో ప్రోమోలో యావర్-అంబటి అర్జున్, గౌతమ్-ప్రశాంత్ ల మధ్య కొన్ని సంభాషణలు చూపించాడు బిగ్ బాస్. ఇక ఆ తర్వాత కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్.. " మీకు ఇదే చివరి అవకాశం.. ఎవిక్షన్ పాస్ పొందడానికి ఒకే ఒక్క టాస్క్ ఇస్తున్నాను. ఇందులో గెలిచిన వారిదే ఎవిక్షన్ పాస్ " అని  చెప్పాడు.

ఒక టేబుల్ స్టాండ్ మీద మొదట ప్లేట్, తర్వాత కప్పు, సాసర్ అంటూ ఒక్కొక్కటిగా పేర్చాలి.. ఇక వాటిని కింద పడకుండా ఎంత ఎక్కువ సేపు ఉంటారో వారే విజేత అని కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ చెప్పగా.. మొదట శోభాశెట్టి అవుట్ అయింది. ఆ తర్వాత అశ్వినిశ్రీ, రతిక, అంబటి అర్జున్, శివాజీ, యావర్, గౌతమ్ అవుట్ అయినట్టుగా తెలుస్తుంది. చివరగా ప్రియాంక, ప్రశాంత్ రేస్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ టాస్క్ పూర్తయిందని, పల్లవి ప్రశాంత్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలిచాడని నెట్టింట ప్రచారం జరుగుతుంది. మరి ఇది ఎవరికి దక్కిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.