Read more!

English | Telugu

నిశ్శబ్దాన్ని చదివేస్తున్న రష్మీ!

 


రష్మీ గౌతమ్ బుల్లితెర మీద తిరుగులేని యాంకర్ గా దూసుకుపోతోంది. ఈమె కొన్ని మూవీస్ కూడా చేసింది. "గుంటూరు టాకీస్, బొమ్మ బ్లాక్ బస్టర్, నెక్స్ట్ నువ్వే"  వంటి కొన్ని మూవీస్ లో నటించింది. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ని ఎంచుకుని చేస్తున్నా కూడా ఆమెకు పెద్దగా బ్రేక్ రావడం లేదు. దాంతో మూవీస్ కి బ్రేక్ ఇచ్చేసింది. ప్రస్తుతం ఆమె "జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ" షోస్ కి మాత్రం హోస్ట్ చేస్తోంది. రష్మీ గౌతమ్ తెలుగు మాములుగా ఉండదు. ఆమె మాట్లాడితే ఎవ్వరైనా సరే  పడీపడీ నవ్వుకోవాల్సిందే. ఎన్ని వంకర్లు, వగలు పోతూ ఉంటుంది ఆమె తెలుగు.

అలాంటి రష్మీ గౌతమ్ కి జంతు ప్రేమ కొంచెం ఎక్కువే..ఎందుకంటే ఎక్కడ, ఎలాంటి ప్రాణికి ఆపద వచ్చినా..వాటిని ఎవరైనా హింసించినా సోషల్ మీడియాలో వాళ్ళ గురించి ఒక రేంజ్ లో వార్నింగ్  ఇస్తూ ఉంటుంది. రీసెంట్ గా బ్రహ్మాజీతో కలిసి సిక్స్త్ సెన్స్ షోకి వచ్చి గేమ్ ఆది లక్ష రూపాయలు గెలుచుకుంది. ఆ డబ్బుని తాను వైజాగ్ లో స్టార్ట్ చేసిన మూగ జీవాల ఆర్గనైజషన్ కి ఖర్చు పెడతాను అని చెప్పింది. ఇప్పుడు మీరు చూస్తే గనక సెలెబ్రిటీస్ అనే  వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా షూటింగ్ టైమ్స్ లో కానీ, ఖాళీ దొరికినప్పుడు కానీ చేతిలో తప్పనిసరిగా ఒక ఇంగ్లీష్ బుక్ చదువుతూ కనిపిస్తూ ఉంటారు.

ఇలాంటి బుక్ చదివే ఫొటోస్ ని షూటింగ్ టైమ్స్ లోవి మనం  ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఐతే ఇప్పుడు రష్మీ మాత్రం ఇంట్లో కూర్చుని నిశ్శబ్దాన్ని ఆవాహన చేస్తూ కూర్చుని. అంటే "ఏకోస్ ఆఫ్ సైలెన్స్" అనే ఇంగ్లీష్ బుక్ ని ప్రశాంతంగా రకరకాల యాంగిల్స్ లో పడుకుని, కూర్చుని చదువుకుంటూ ఉంది. తనుషి సింగ్ రాసిన ఈ బుక్ ని చదువుతూ మధ్యమధ్యలో సూన్యంలోకి చూస్తూ ఉంది రష్మీ. ప్రేమ యొక్క అత్యున్నత రూపం నమ్మకం. మీరు నమ్మకం పెట్టుకుని ఏ పని చేసిన ఈ మొత్తం విశ్వం వాళ్లకు లొంగిపోతుంది. దేవుడితో మనం ఎలా మాట్లాడతాం.. నిశ్శబ్దంగానే కదా...ఈ పుస్తకంలో అలాంటి నిశ్శబ్దమే ఉంటుంది. భగవంతుడి ప్రేమను పొందడం ఆ ప్రేమ ఆమె జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది అనే ఆధ్యాత్మిక వివరణ ఉన్నదే ఈ పుస్తకం.

"జీవితంలో కొన్ని రోజుల్ని పాజ్ చేసేయాలి. మనం ఏం చేస్తున్నాం, మనం ఎంచుకుంటున్న దారులు సరైనవా కావా అనే విషయాలను పునరాలోచించుకోవాలి. ఈ పుస్తకాన్ని నా ఈవెనింగ్  కాఫీతో చదివినందుకు...నా ప్రయత్నానికి మంచి సపోర్ట్ గా నిలిచినందుకు  ధన్యవాదాలు" అంటూ తన పిక్ తో పాటు ఈ కాప్షన్ పెట్టుకుంది..ఈ పిక్ చూసిన ఈ బుక్ రైటర్ తనుషి సింగ్ కామెంట్ చేశారు. "నా పుస్తకం చదివినందుకు ధన్యవాదాలు...నీ దారిలో నువ్వు రాక్ చేస్తూ ఉండు" అని మెసేజ్ ఇచ్చారు. "ఫోటోకి పోజ్ ఇవ్వడం కాదు బుక్ చదువు ముందు" అంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.